ఒకప్పుడు సెన్సేషనల్ డైరెక్టుగా  సూపర్ హిట్ సినిమాలు అందించిన కృష్ణ వంశీ నక్షత్రం తర్వాత ఎవరికి కనబడలేదు. తనతో సినిమా అంటే హీరోలు భయపడేలా చేసుకున్నాడు. కృష్ణ వంశీ సినిమా అంటే ఆడియన్స్ లో ఒక అంచనాలు ఉండేవి.. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. 

 

ప్రస్తుతం కృష్ణ వంశీ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో సర్ ప్రైజ్ చేశాడు. మరాఠీ లో సూపర్ హిట్టైన నట సామ్రాట్ మూవీ తెలుగు రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కృష్ణ వంశీ. మరాఠీలో నానా పటేకర్ నటించిన ఈ మూవీ తెలుగు రీమేక్ లో ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. కృష్ణ వంశీ ప్రకాష్ రాజ్ కాంబోలో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇదే క్రమంలో ఈ రంగమార్తాండ కూడా అదే రేంజ్ సక్సెస్ అందుకుంటుందని అంటున్నారు. 

 

మరాఠీ సినిమాను మక్కికి మక్కి దించకుండా తన మార్క్ క్రియేటివిటీ తో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఈ సినిమా లో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఈ మూవీ తో కృష్ణ వంశీ కూడా మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో సర్ ప్రైజ్ చేశాడు కృష్ణ వంశీ. 

 

ఫ్లాపుల్లో ఉన్న తనకి ఏ ఒక్క స్టార్ అవకాశం ఇవ్వలేదు అందుకే తనంటత తానే ఈ రీమేక్ తో సత్తా చాటుతాడని తెలుస్తుంది. మరి రంగమార్తాండ అనుకున్న విధంగా ఉంటుందా మరాఠీ సినిమా రికార్డును అందుకుంటుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: