సైరా కోసం చిరంజీవి ఎందుకు అందరి చుట్టూ తిరుగుతున్నారు అనేది ప్రశ్నర్ధకంగా మారింది. సైరా సినిమా ముసుగులో పొలిటికల్ టూర్ చేస్తున్నారా? మామూలు టైమ్ లో ఇలాంటి భేటీలన్నీ కుదరవని, అందుకే సినిమాని అడ్డం పెట్టుకుని అందర్నీ చుట్టేస్తున్నారు అంటూ పుకార్లు బాగా వస్తున్నాయి. మెగా అభిమానులంతా అసలు మెగాస్టార్ కు ఏమైంది? ఇప్పటివరకు లేని ఆనవాయితీని కొత్తగా 151 సినిమాకు ఎందుకు  స్టార్ట్ చేశారు అనుకుంటున్నారు.

సైరా  సినిమా ఫంక్షన్ కి కూడా  ఏ రాజకీయ నేతనీ పిలవని ఆయన ఒక్క  పవన్ కల్యాణ్ ను తప్పించి, కానీ అది వేరే లెక్కలోకి వస్తుంది. కానీ ఇప్పుడు  సినిమా విడుదలైన తర్వాత ఎందుకు అందరిని కలుస్తున్నారు. ఈ కలయికల వల్ల ఆయనకు ఉన్న లాభాలు ఏంటి? అసలేం జరుగుతోంది? వంటి ప్రశ్నలు అభిమానులని వెంటాడుతున్నాయి. చిరంజీవి చేస్తున్న  ఈ పని వల్ల అయన  ఇమేజ్  పడిపోతుంది అని  ఓ వర్గం వాపోయారు.

ఇది కేవలం సినిమాని కాపాడుకోవటం, రాయితీల కోసం మరియు అవార్డుల కోసమే అయితే  చిరంజీవి ఇంతలా  అందరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఎంతమాత్రం లేదంటున్నారు ఆయన అభిమానులు. అయితే ఉయ్యాలవాడ చరిత్రపై చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వీటన్నిటినీ జోడించి,కొన్ని కల్పితాలని సృష్టించి,మంచి కమర్షియల్ హంగులతో కథని తెరకెక్కించారు. సినిమా బాగుందని పలు  ప్రశంసలొచ్చినా,చిరంజీవి నటన అద్భుతం అంటూ అభిమానులంటున్నా......కలెక్షన్ల పరంగా ఇంకా సినిమా అనుకున్న స్థాయికి చేరుకోలేదు అంటున్నారు.

ఇలాంటి సమయంలో డైరెక్టుగా చిరంజీవినే  రంగంలోకి దిగారు. గవర్నర్లను, ముఖ్యమంత్రుల్ని, రాజకీయ నాయకుల్ని వరసబెట్టి కలుస్తూ తన సినిమాకి క్రేజ్ పెంచే పనిలో ఉన్నారని తెలుస్తుంది. చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ  అయితే అసాధ్యం.కేవలం సినిమా కోసమే కాకుండా తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చిరంజీవి అందర్నీ కలుస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక మీదట టాలీవుడ్ లో ఏ వ్యవహారం వచ్చినా చిరంజీవినే  ముందుండి పరిష్కరిస్తారని చెప్తున్నారు టాలీవుడ్ సినీ ప్రముఖులు.


మరింత సమాచారం తెలుసుకోండి: