బిగ్ బాస్  తెలుగు సీజన్ 3 చివరి అంకానికి చేరుకుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది. టెలివిజన్ రంగ చరిత్రలోనే సంచలనం సృష్టించిన బిగ్ బాస్ 3 ఇంకొన్ని వారాల్లో  ముగియనుంది. కాగా ప్రస్తుతం 11 వారాలు పూర్తి చేసుకొని 12వ వారం లో అడుగుపెట్టింది బిగ్ బాస్ తెలుగు సీసన్ 3. అయితే 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్  తెలుగు సీజన్ 3 ప్రతివారం ఒక్కొక్కరిని ఎలిమినేట్  చేసుకుంటూ వచ్చి చివరికి ప్రస్తుతం 7 సభ్యులతో కొనసాగుతోంది. అయితే ఈ వారం నామినేషన్ లో ఉన్న శివజ్యోతి, వితిక, బాబా భాస్కర్ పేర్లలో ఎక్కువగా ఎలిమినేట్ అయ్యేది వితిక అనే వార్తలు వస్తున్నాయి అటు బిగ్ బాస్ వోటింగ్ చూసినా కూడా అదే చెబుతుంది. 

 

 

 

 అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచి ఒక పెద్ద మనిషి లాగా వ్యవహరించిన వరుణ్ సందేశ్ తన భార్య వితిక ని   ఒక కంటెస్టెంట్స్ లాగె  చూసాడు. అయితే తాజాగా నామినేషన్స్ లో మాత్రం  తన భార్య గా ట్రీట్ చెయ్యడం తో ఆడియన్స్ వీరిద్దరిపై కాస్త నెగటివ్ ఇంప్రెషన్ తో ఉన్నారు. అయితే  శ్రీముఖి కూడా మొదటి నుంచి రాహుల్ ని టార్గెట్ చేయగా మధ్యలో కాస్త రాహుల్ తో మింగిల్ అయినట్టు  కనిపించినప్పటికీ తాజా నామినేషన్స్  లో మళ్ళీ రాహుల్ ని టార్గెట్ చేయడం తో శ్రీముఖి పై కూడా ఆడియన్స్ లో కాస్త నెగటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది. అయితే అటు రాహుల్ మాత్రం ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికి వాటిని ఎదుర్కొని నిలబడటంతో... ఫాన్స్ లో రాహుల్ కి రోజురోజుకి మద్దతు పెరుగుతోంది. 

 

 

 

 

 కాగా ఇంకో రెండు  వారాల్లో మరో ఇద్దరు కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుండగా... మూడో వారంలో ఐదుగురు ఫైనల్ కు చేరుకుంటారు. ప్రస్తుతం ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ లో బిగ్ బాస్ తెలుగు సీసన్ 3  విన్నర్ గా  ఎక్కువగా ముగ్గురు పేర్లు వార్తల్లో  వినిపిస్తున్నాయి. వరుణ్ సందేశ్,  శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్. ఈ ముగ్గురి పేర్లు బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ జాబితాలో కనిపిస్తున్నాయి. అయితే రాహుల్  అందరిలో తన పాజిటివ్ ఆటిట్యూడ్ తో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు  . అయితే వరుణ్ సందేశ్ కి కూడా బాగానే ఫాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ వితిక కారణంగా కాస్త ఆడియన్స్ లో నెగటివ్ ఇంప్రెషన్ కూడా ఉంది. ఇక శ్రీముఖి రాహుల్ ని టార్గెట్ చేస్తూ ఉండడంతో శ్రీముఖి పై కూడా కాస్త నెగటివ్ ఇంప్రెషన్ ఉంది ఆడియన్స్ లో. అయితే  బిగ్ బాస్ తెలుగు సీసన్ 3 విన్నర్ గా రాహులే అవుతాడని ఎక్కువమంది ఆడియన్స్ భావిస్తున్నారు. మరి బిగ్ బాస్  తెలుగు సీజన్ 3 విన్నర్ ఎవరో తెలియాలంటే ఇంకో మూడు వారాలు ఆగాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: