తెలుగు సినిమా గతిని మార్చేసిన సినిమా ఏంటని అంటే అందరి నుండి వచ్చే పేరు "శివ". రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా ద్వారా ఎందరో సాంకేతిక నిపుణులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలాగే ఎందరో దర్శకులు తయారయ్యారు. అయితే ఈ సినిమా తీయకముందు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక్క సినిమాకి కూడా అసిస్టెంట్ గా చేయలేదు.


అసలే అనుభవం లేకుండానే సినిమా తీసిన ఘనుడాయన. అయితే ఈ సినిమాలో ఒకానొక టెక్నిషియన్ గా పనిచేసి ఆ తర్వాత, కెమెరా మెన్ గానూ, దర్శకుడిగానూ మారిన ఒకవ్యక్తి ఉన్నారు. ఆయనే తేజ. తేజగారు మొదటగా కెమెరా మెన్ కి అసిస్టెంట్ గా వచ్చి, ఆ తర్వాత కెమెరా మెను గా కొన్ని చిత్రాలకు పని చేసి "చిత్రం" సినిమా ద్వారా దర్శకుడయ్యాడు. అయితే ఆయన దర్శకత్వంలో వచ్చిన "జయం" సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.


ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్తవారిని పరిచయం చేసిన ఘనత తేజ గారిది. ఆయన సినిమాల్లో ఎక్కువగా కొత్తవారే కనిపిస్తారు. అయితే తాజాగా ఉత్తేజ్ యాక్టింగ్ స్కూల్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ యాక్టింగ్ స్కూల్ కోసం ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ కి విచ్చేసిన దర్శకుడు తేజ తనదైన శైలిలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నాడు.


ఒక యాక్టర్ కి ఉండాల్సిన లక్షణాలని గూర్చి చెబుతూ చాలా ఉదాహరణలు ఇచ్చారు.  అయితే అసలు సినిమా తీయాలంటే అసలేమీ అవసరం లేదనీ, ఎలాంటి రూల్స్ పాటించకుండా సినిమా తీసేయచ్చని, అసలు సినిమా అంటేనే రూల్స్ ని బ్రేక్ చేయడమని, అయితే ఆ రూల్స్ ని బ్రేక్ చేయాలంటే ఆ రూల్స్ ఏంటో తెలుసుకోవడం కంపల్సరీ అని అందుకే ఆ రూల్స్ తెలుసుకోవడానికి తప్పకుండా శిక్షణ తీసుకోవాలని చెప్పాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: