సంక్రాంతి సినిమాల రేస్ కు సంబంధించిన వ్యవహారం అల్లు అర్జున్ మహేష్ ల ఇగో వార్ గా మారిన నేపధ్యంలో ఈ డైరెక్ట్ వార్ జరగడం ఎవరికీ మంచిది కాదు అంటూ ఇప్పటికే అనేక రాయబారాలు జరుగుతున్నాయి. వెంకటేష్ లాంటి సీనియర్ హీరో నటించిన ‘వెంకీ మామ’ సంక్రాంతి రేసుకు వస్తుంది అంటే భయపడిపోతున్న బన్నీ మహేష్ ల సినిమాల బయ్యర్లు అదే సంక్రాంతి రేసుకు రాబోతున్న ‘ఎంత మంచివాడవురా’ మూవీ గురించి కనీసం ఒక్క మాట కూడ పట్టించుకోవడం లేదు అని టాక్.

ఇదే సంక్రాంతి రేస్ కు రాబోతున్న రజినీకాంత్ ‘దర్బార్’ మూవీ గురించి ఆరాలు తీసుతున్న బయ్యర్లు కళ్యాణ్ రామ్ మూవీ పేరు కూడ పట్టించుకోవక పోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది అని అంటున్నారు. వాస్తవానికి ఈ సినిమాను నిర్మించింది దిల్ రాజ్. సతీష్ వేగ్నేస్న లాంటి దర్శకుడు ఈ మూవీకి దర్శకత్వం వహించినా ఈ మూవీకి ఎటువంటి ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ లేకపోవడంతో ఈ మూవీని అసలు లెక్కలోకే తీసుకోవడం లేదు అని అంటున్నారు.

దీనితో ఈ మూవీ సంక్రాంతి రేసు నుండి తనకు తానుగా తప్పుకుంటుందా అన్న సందేహాలు వస్తున్నాయి. కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చి పుష్కర కాలం దాటిపోతున్నా ఇప్పటి వరకు ఒక ‘పటాసు’ మూవీలో తప్ప మరి ఏ మూవీలోను సూపర్ హిట్ ను చూడలేక పోయాడు. 

అయినా పట్టువదలని వదలని విక్రమార్కుడు లా కళ్యాణ్ రామ్ ప్రతిసంవత్సరం తన సినిమా ఒకటి ఉండేలా చూసుకుని తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతరం యూత్ కు కళ్యాణ్ రామ్ కనెక్ట్ కాలేకపోతున్నాడు. దీనితో ఈ నందమూరి హీరో ఎంత ప్రయత్నించినా హిట్స్ అతడి గుమ్మం దాకా రాలేకపోతున్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: