తెలుగు లో ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న హీరో డాక్టర్ రాజశేఖర్.  కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించినప్పటికీ  పవర్ ఫుల్ పోలీస్ కథా నేపథ్యంలో వచ్చిన ‘అంకుశం’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతో యాంగ్రీయంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ తర్వాత కొన్ని యాక్షన్ తరహా సినిమాల్లో నటించారు.  ఒకే తరహా యాక్షన్ సినిమాల్లో నటించడంతో ఆదరణ తగ్గింది..దాంతో ఫ్యామిలీ తరహా సినిమాలపై దృష్టిసారించారు.  తన సహనటి అయిన జీవితను వివాహం చేసుకున్నాడు రాజశేఖర్. 

కొంత కాలంగా ఆయన నటించిన సినిమాలు పెద్దగా ఆదరణలకు నోచుకోలేదు..దాంతో చాలా కాలం వరకు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చారు.  ఆ మద్య ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ‘గరుడవేగ’ సినిమాలో నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు..మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది.  దాంతో డాక్టర్ రాజశేఖర్ హీరోగా మరోసారి తన సత్తా చూపించేందుకు రెడీ అయ్యారు.  ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ సినిమాలో నటించాడు.  ఈ మూవీ కూడా మంచి సక్సెస్ సాధించినా..కమర్షియల్ హిట్ మాత్రం కాలేకపోయింది.

తాజాగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమైనట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి.  కన్నడంలో సూపర్ హిట్ కొట్టిన 'కవుల్దారి' సినిమాకి ఇది రీమేక్. ఇది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సాగించే ఇన్వెస్టిగేషన్ స్టోరీ. అయితే పోలీస్ కథా నేపథ్యంలో ఉండటంతో రాజశేఖర్ ఓకే అన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. దాంతో ఈ మూవీలో హీరో సుమంత్ తో తీయాలని దర్శక, నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారట. క వీరభద్రమ్ చౌదరితో రాజశేఖర్ కథా చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రాజెక్టు సెట్ అవుతుందేమో చూడాలి మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: