టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ నటప్రపూర్ణ మంచు మోహన్ బాబుగారు మన తెలుగు వారందరికీ ఎంతో సుపరిచితమే. మొదట ప్రతినాయకుడిగా నటించి, తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న మోహన్ బాబు గారు, ఆ తరువాత పూర్తి స్థాయి హీరోగా అలానే నిర్మాతగా మారి తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరించారు. ఇక ఆయన తనయులైన విష్ణు, మనోజ్ మరియు కుమార్తె మంచు లక్ష్మి, ప్రస్తుతం సినిమాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

ఇక ఇటీవల ఎంతో వైభవోపేతంగా వివాహం చేసుకున్న ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్, నేడు తన భార్య నుండి విడాకులకు సిద్దమైనట్లు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెల్పడం జరిగింది. 2015, మే లో ప్రణతి రెడ్డిని వివాహమాడిన మనోజ్, ఇటీవల తన భార్యతో కొన్ని కారణాల వలన చివరికి విడాకులకు సిద్దమైనట్లు తెలిపారు. "గత కొద్దిరోజులుగా మా కుటుంబంలో నలుగుతున్న సమస్య మీకు చెప్పదలచుకున్నాను, కొన్ని అనివార్య కారణాల వలన ప్రణతి నుండి నేను విడాకులు తీసుకోదలిచాను. నిజానికి గత కొద్దిరోజులుగా ఈ సమస్యల వలన ఎంతో ఆందోళన చెందుతూ, నా మనసుని దేనిపైనా లగ్నం చేయలేకపోయాను. 

అయితే ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు మరియు అభిమానులు నాకు ఎంతో వెన్నుదన్నుగా నిలిచి నాకు ధైర్యాన్ని అందించడం జరిగింది. కొన్ని సంఘటనలు ఎలా జరగాల్సి ఉంటె అలా జరుగుతాయి. ప్రస్తుతం నా భార్య నుండి విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నాను, ఆమె కూడా తన రాబోయే లైఫ్ లో బాగా స్థిరపడాలని కోరుకుంటున్నాను. అంతేకాక ఇకపై తన పూర్తి దృష్టి సినిమాలు మరియు కెరీర్ పైనే పెట్టదల్చుకున్నాను, కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి అంటూ ఆయన తన సోషల్ మీడియా మాధ్యమాల్లో మనోజ్ పోస్ట్ చేయడం జరిగింది. కాగా ప్రస్తుతం ఈ మ్యాటర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: