యువ హీరో నితిన్ వెంకీ కుడుముల డైరక్షన్ లో వస్తున్న సినిమా భీష్మ. నితిన్ కు అర్జెంట్ గా హిట్టు కొట్టాల్సిన టైం ఇది. మిగతా యువ హీరోలు అంతా వరుస సంచలనాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటుంటే నితిన్ మాత్రం ఇంకా స్టార్ ఇమేజ్ తెచ్చుకోలేదు. అందుకే వెకీతో జతకట్టి భీష్మ సినిమా చేస్తున్నాడు నితిన్.


ఈ సినిమాలో ది చార్మింగ్ అండ్ లక్కీ గాళ్ రష్మిక మందన్న నటిస్తుందని తెలిసిందే. ఆమె సినిమా చేస్తే సినిమా హిట్టే అన్న సెంటిమెంట్ వచ్చింది. అందుకే ఆమెతో సినిమాకు స్టార్స్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్న రష్మిక అల్లు అర్జున్ సుకుమార్ మూవీలో కూడా ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది.


ఇక తనకు తెలుగులో మొదటి హిట్ ఇచ్చిన దర్శకుడు కాబట్టి వెంకీ కుడుములకు ఓకే చెప్పింది. నితిన్, రష్మిక ఇద్దరు సూపర్ జోడీ.. అందుకే భీష్మ పక్కా హిట్ అనుకున్నారు. అయితే డిసెంబర్ చివర్లో క్రిస్ మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. కాని ఆ టైంకు వరుస సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ సాయి తేజ్ ప్రతిరోజు పండుగే సినిమా డిసెంబర్ 20న రిలీజ్ అని అఫిషియల్ గా చెప్పారు. అనుష్క లీడ్ రోల్ లో చేస్తున్న నిశబ్ధం కూడా క్రిస్ మస్ సందర్భంగా వస్తుందట.


అందుకే పోటీ ఎందుకు అనుకున్న భీష్ముడు 2020 ఫిబ్రవరికి సినిమా వాయిదా వేసుకున్నాడని తెలుస్తుంది. ఇక్కడ మరో లక్కీ సెంటిమెంట్ ఏంటంటే వెంకీ కుడుముల ఫస్ట్ మూవీ ఛలో సినిమా ఫిబ్రవరిలో రిలీజై సూపర్ హిట్ అయ్యింది. సో ఆ సెంటిమెంట్ కూడా కలిసి వస్తే భీష్మ సూపర్ హిట్ పక్కా అన్నట్టే. కొన్నాళ్లుగా సరైన హిట్టు సినిమా కోసం వెయిట్ చేస్తున్న నితిన్ భీష్మతో ఆ హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: