వెంకీ ప్రస్తుతం నటిస్తున్న సినిమా వెంకీ మామ.. నాగ చైతన్య, వెంకీ నటిస్తున్న మల్టీస్టారర్ సినిమానే వెంకీ మామ.. గోదావరి గట్ల మీద తెరక్కించిన ఈ సినిమాలో చైతు కి జోడిగా రాశిఖన్నా నటించగా, వెంకీ కి జోడిగా హాట్ బ్యూటీ పాయల్ రాజపుత్ నటిస్తున్నారు.  మామ అల్లుళ్ళు నటించిన ఈ సినిమా పై చాలా అంచనాలే ఉన్నాయి. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ఆ ముందుకు రాబోతుంది,..


ఆనాటి కాలంలో యాక్షన్ సినిమాలు చేస్తే హీరో లకు డూపులు పెట్టి  తెరకెక్కించారు అలా కష్టం తేరా వెనక ఉన్న వాళ్ళది అయితే.. ఫలితం మాత్రం హీరోలకు దక్కేది.. కానీ, ప్రస్తుతం డూపులు చేసే సినిమాలు మాత్రం తక్కువయ్యాయి. రాను రాను పాదాన్యం తగ్గింది. ఇండస్ట్రీలోని యంగ్ హీరోలంతా స్టంట్లు స్వయంగానే చేస్తున్నారు. దాని కోసం శిక్షణలు కూడా తీసుకుంటున్నారు.


కొన్ని సినిమాలలో గుర్రపు స్వారీ, కత్తిసాములు వంటివి వారు నేర్చుకొని స్వయంగా సినిమాలు చేస్తున్నారు. ఆ మాటకొస్తే.. పెద్ద హీరోలు అయిన బాలకృష్ణ గోవర్ధమై పుత్ర శతకర్ణ సినిమాలో డూపులు లేకున్నా ఆయనే స్వయంగా అన్ని రకాల యుద్దాలు చేసి భేష్ అనిపించుకున్నాడు. మొన్న స్వాతంత్య్ర సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కిన సైరా సినిమా లో చిరు కూడా సాహసాలు  చేసి భేష్ అనిపించుకున్నాడు. 


అసలు విషయానికొస్తే ప్రస్తుతం వెంకీ కూడా నేను  సాహసం చేస్తానంటూ ముందుకొచ్చాడు. పెళ్ళి చూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేష్ హార్స్ రైడర్‌గా కనిపించనున్నారు.ఈ సినిమాకోసం వెంకీ హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నాడు. వెంకీ కి మోకాలుకు గాయం కావడంతో హార్స్ రైడ్ చేయడం మంచిది కాదని అంటున్న కూడా వెంకీ రిస్క్ చేస్తానంటున్నాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: