రజినీకాంత్ కొత్త సినిమా దర్బార్ షూటింగ్ వేగంగా జరుగుతున్నది. రజినీకాంత్ వెర్షన్ ఇప్పటికే పూర్తయింది. మిగతా షూటింగ్ పార్ట్ కూడా త్వరగా కంప్లీట్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ. రాజకీయాలకు సంబంచించిన సినిమా కాదని మురుగదాస్ పేర్కొన్నారు.
గజినీ సినిమా సమయంలోనే ఈ ఇద్దరు కలిసి సినిమా చేయాల్సి ఉన్నది. గజినీ హిట్ తరువాత పిలిచి రజినికాంత్ అభినందనలు తెలిపారట. ఆ తరువాత రజినీకాంత్ మరో రెండేళ్ల తరువాత ఓసారి పిలిచి సినిమా చేద్దామని చెప్పారట. కానీ అలా వాయిదా పడుతూ వచ్చింది. సర్కార్ సమయంలో పిలిచి రజినీకాంత్ సినిమా గురించి అడిగితే.. లైన్ చెప్పినట్టు మురుగదాస్ పేర్కొన్నారు.
లైన్లో చిన్న మార్పులు చెప్పగా నెల రోజుల తరువాత రజినీకాంత్ ను కలిసి కథ వినిపించగా ఒకే చెప్పారని మురుగదాస్ పేర్కొన్నారు. ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ అని, ఇందులో రజినీకాంత్ రెండు వైవిధ్యభరితమైన పాత్రల్లో కనిపించబోతున్నారనే, మాస్ అభిమానులకు తప్పకుండా ఈ సినిమా నచ్చుతుందని అంటున్నాడు మురగదాస్. ఇలాంటి కథతో సినిమా చేయడం మురుగదాస్ కు అదే మొదటిసారి అని చెప్పుకొచ్చారు.
కాగా, ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను నవంబర్ 7 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. మోషన్ పోస్టర్ రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మోషన్ పోస్టర్ ను బట్టి సినిమా ఎలా ఉంటుందో ఒక అంచనాకు రావొచ్చు. టీజర్, ట్రైలర్ రిలీజైతే సినిమా ఎలా ఉండబోతుంది అన్నది అర్ధం అవుతుంది. ఈ సినిమా తరువాత రజినీకాంత్
శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.