2014 లో ముకుంద సినిమాతో  తెలుగు తెరకు పరిచయం అయింది ఈ  భామ. పూజ హెగ్డే అగ్ర హీరోలతో జతకట్టింది, ఈమె  నటించిన  తెలుగు సినిమాలు ఒక లైలా కోసం, ముకుంద, డీజే దువ్వాడ జగన్నాథమ్, అరవింద సమేత వీరరాఘవ, రంగస్థలం, సాక్ష్యం, మహర్షి, గద్దలకొండగణేష్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పుడు దర్శకుడు ఎలాంటి సినిమా తీయాలన్న దానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది పూజా.

ఎలాంటి పాత్రలోనైనా ఒదిగి పోయి నటిస్తుంది  పూజ. ఇక తన అందం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు అటు గ్లామర్ పాత్రలు చేయడంలో...ఇటు  భిన్నమైన పాత్రలు చేయడం లోను పూజ హెగ్డే కు  మంచి పేరుంది. తాజాగా ఈ భామ గడ్డలకొండ  గణేష్ సినిమాలో  పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి అందమైన ముద్దుగుమ్మల కనిపించి అందరినీ మెప్పించింది. ఆ తర్వాత  అలవైకుంఠపురము, ప్రభాస్ నెక్స్ట్ మూవీ లో కూడా కనిపించనుంది. ఇటు టాలీవుడ్ లో  వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అటు బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది ఈ అమ్మడు . దీనీలో  భాగంగానే హౌస్ ఫుల్ 4 అనే సినిమాల్లో నటించింది ఈ భామ. కాగా  ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది పూజ. అయితే అక్షయ్ కుమార్,  రితేష్ దేశ్ముక్,  బాబీ డియోల్,  రానా దగ్గుబాటి,  కృతి సనన్, కృతి కర్బంద, పూజా హెగ్డే ముఖ్య పాత్రల్లో నటిస్తున్న హౌస్ ఫుల్ 4 చిత్రం ప్రమోషన్స్ ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్  కూడా చేస్తున్నారు. పియూష్ గోయల్  చేయడం ఏంటా  అని అనుకుంటున్నారా?అయితే  ఏంటో  చూద్దాం..ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ హౌస్‌ఫుల్ 4 ఎక్స్‌ప్రెస్ అనే కొత్త రైలును ప్రవేశపెట్టారు. ఇక నుంచి ఈ రైలులో నటీనటులు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవచ్చని ప్రకటించారు. ఈ రకంగా రైల్వే శాఖ ప్రయాణికులకు మరింత చేరువవుతుందని తెలిపారు.

దీనికి ప్రమోషన్స్ ఆన్ వీల్స్ స్కీం అనే పేరు పెట్టారు. 16, 17 తేదీల్లో ముంబయి నుంచి దిల్లీ వెళ్లే రైలులో హౌస్‌ఫుల్ 4 చిత్రబృందం ప్రయాణించనుందని దీని ద్వారా వారు తమ సినిమా ప్రమోషన్స్ కూడా చేసుకోవచ్చని గోయల్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. అలా ఈ స్కీంను వాడుకున్న తొలి చిత్రబృందం హౌస్‌ఫుల్ 4 కావడం విశేషం. దాంతో వారి సినిమాకు మరింత ప్రచారం వచ్చినట్లైంది. ఫర్హాద్ సంఝీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 25న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ  సినిమా ఎంత విజయం మూటకట్టుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: