మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది.  నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నది.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరక్కబోతున్నది.  అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉండొచ్చు.  ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమాలో నటించే హీరోయిన్ల లిస్ట్ చాలా ఉన్నది.  అందులో ఎవర్ని సెలక్ట్ చేయబోతున్నారు అన్నది సస్పెన్స్ గా ఉన్నది.  నయనతార, త్రిష, కాజల్, అనుష్క ఇలా చాలామంది పేర్లు తెరమీదకు వచ్చాయి.  


కానీ ఎవర్ని తీసుకోబోతున్నారు అన్నది మాత్రం సస్పెన్స్.  ఇక ఇదిలా ఉంటె, ఈ మూవీ గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.  సినిమా టైటిల్ ఏంటి అన్నది బయటపెట్టలేదు.  సినిమాకు సంబంచిందిన అన్ని విషయాలు సెట్ కాగానే టైటిల్ ను ప్రకటిస్తారా.  టైటిల్ ప్రకటించిన తరువాత షూటింగ్  స్టార్ట్ అవుతుంది.  అయితే, కొరటాల శివ సినిమాలు ఒక సామాజిక అంశం చుట్టూ కథ నడుస్తుంది.  కథలో బలం ఉంటుంది కాబట్టి సినిమా కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది.  


 ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమాకు సంబంధించిన కథ ఇది అని ఒక ప్రచారం జరుగుతున్నది.  అదేమంటే ఈ సినిమా దేవాలయాలు, వాటి సమస్యల చుట్టూ కథ నడుస్తుందనిఅంటున్నారు . దేవాలయాల చుట్టూ ఉండే సమస్యల మీద సినిమా ఉంటుంది అంటే ఆసక్తికరంగానే ఉంటుంది.  కొరటాల మంచి పాయింట్ ను తీసుకొనే ఉంటాడు అనడంలో సందేహం అవసరం లేదు.  


గతంలో మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా అన్ని సినిమాలు దేనికదే డిఫరెంట్ గా ఉంటాయి.  అద్భుతంగా ఉంటాయి.  కాబట్టి ఈ సినిమా కూడా అదే విధంగా ఉండే ఉంటుంది.  తప్పకుండా సినిమా ఆ రేంజ్ లోనే హిట్ అవుతుందని అంటున్నారు.  ఇక ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: