ప్రస్తుతం తెలుగు టెలివిజన్ తెరపై మంచి రేటింగ్స్ మరియు ప్రేక్షకాధరణతో దూసుకెళ్తున్న షోల్లో జబర్దస్త్ షో కూడా ఒకటి. ఇక ఈ షోలోని స్కిట్స్ కు కేవలం ఆ ఛానల్ లో మాత్రమే కాక, యూట్యూబ్ లో కూడా విపరీతమైన వ్యూస్ వస్తున్నాయి అంటే, షో ఎంత మంచి సక్సెస్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆ షో ద్వారా మంచి పాపులరైన వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. మొదట మెజీషియన్ గా కెరీర్ ప్రారంభించిన సుధీర్, ఆ తరువాత కొన్ని ప్రోగ్రామ్స్ కు నిర్వాహకుడిగా, ఆపై జబర్దస్త్ షోలోని స్కిట్స్ లో సైడ్ యాక్టర్ గా నటించారు. అయితే తన టాలెంట్ తో ఆ తరువాత ఒక టీమ్ ని సెట్ చేసుకున్న సుధీర్, సుడిగాలి సుధీర్ పేరుతో ఎంతో పాపులర్ అయ్యారు. ఇక అదే షోతో తన ఆకట్టుకునే అందం మరియు వాక్చాతుర్యంతో యాంకర్ గా మంచి పేరు సంపాదించిన రష్మీకి కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. 

అయితే ఇటీవల ఒక పండుగ సందర్భంగా జరిగిన ఒక స్కిట్ లోని సీన్ ప్రకారం, సుధీర్ మరియు రష్మీలకు పెళ్లి జరుగుతుంది. ఇక ఆ సీన్ తరువాత నుండి వారిద్దరి మధ్య ఏదో ఉందని వారు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా వార్తలు ప్రచారం అవ్వడం మొదలయ్యాయి. అయితే ఆ వార్తలు అంతటితో ఆగకుండా ప్రచారం అవుతుండడంతో, మధ్యలో సుధీర్ మరియు రష్మీ ఇద్దరూ కూడా మా మధ్య మీరు అనుకుంటున్న సంబంధం ఏమి లేదు, ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ వివరణ కూడా ఇచ్చారు. అయినా కూడా ఇప్పటికీ అక్కడక్కడా వీరిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇకపోతే నేడు తన ఫ్యాన్స్ తో మాట్లాడడం కోసం యూట్యూబ్ లో ఒక వీడియో చాట్ చేసిన మరొక జబర్దస్త్ ఆర్టిస్ట్ గెటప్ శ్రీను, 

తనకు ఒక అభిమాని సుధీర్ మరియు రష్మిల పెళ్ళికి సంబంధించి అడిగిన ప్రశ్నకు షాకింగ్ గా మరియు ఎంతో సున్నితంగా సమాధానం ఇచ్చారు. వారిద్దరి పెళ్లి పై ఎప్పటినుండో వార్తలు ప్రచారం అవుతున్నాయి, మధ్యలో వారు ఆ విషయమై వివరణ ఇచ్చినప్పటికీ ఈ వార్తలు ఎందుకు ఆగడం లేదో అర్ధం కావడం లేదని, సుధీర్ కు ప్రస్తుతం పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, అలానే రష్మీ గారికి కూడా సెపరేట్ లైఫ్ మరియు ఫ్యామిలీ ఉన్నాయి. సెట్స్ లో ఉన్నంతసేపు మేమందరం మంచి ఫ్రెండ్స్ గా ఉంటాం. అదే ప్రోగ్రాం అయిపోతే, మాములుగా ఎవరి ఇంటికి వారం వెళ్ళిపోతాం, అంతే తప్ప మీరు అనుకుంటున్న విధంగా వారిద్దరి మధ్య ఏమి లేదని అన్నారు......!!    


మరింత సమాచారం తెలుసుకోండి: