రాబోయే మరొక మూడు నెలల్లో రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా అప్పుడే టాలీవుడ్ సినిమాలు సంసిద్ధం అవుతున్నాయి. ఓవైపు సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంటే, మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ ని కూడా పరిగెత్తిస్తున్నారు. ఇకపోతే ఈ రెండు సినిమాలు కూడా రాబోయే సంక్రాంతి సందర్భంగా జనవరి 12నే థియేటర్స్ లోకి వస్తుండడంతో, ప్రస్తుతం ఈ రెండు సినిమాలపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇక ఈ రెండు సినిమాల కాంబినేషన్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉడడంతో రెండు సినిమాలు మంచి విజయవంతం అవుతాయని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఇద్దరిలో ఎవరో ఒకరికి ఓటమి తప్పదని అంటున్నారు. 

అయితే ఆ సమయంలో ఒకే రోజు బాక్సాఫీస్ బరిలోకి దిగబోయే ఈ సినిమాలకు కీలకంగా మారనున్నారు మెగా ఫ్యాన్స్. నిజానికి కొన్నాళ్ల క్రితమే బన్నీకి సపరేట్ గా ఫ్యాన్ బేస్ ఏర్పడిందని, అయితే చిరు, పవన్, చరణ్ ల ఫ్యాన్స్ రాబోయే ఈ రెండు సినిమాల్లో ఎక్కువగా ఏ సినిమాకు మద్దతిచ్చి ఆదరిస్తే, ఆ సినిమా మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు. ఈ విషయమై కొందరు నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో సొంతంగా పలు రకాల పోల్స్ క్రియేట్ చేస్తూ, ఎవరికి మెజారిటీ సక్సెస్ లభిస్తుంది అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే అందులో కొందరు మహేష్ కు ఓటేస్తుంటే, మరికొందరు బన్నీకి ఓటేస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితులను బట్టి కొందరు సినీ విశ్లేషకులు మాట్లాడుతూ, టాలీవుడ్ స్టార్స్ లో నెంబర్ వన్ కి దగ్గరగా ఉన్న నటుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, 

పవర్ స్టార్ మహేష్ బాబు ఎంతో దగ్గరగా ఉంటారని, అంతేకాక వారిద్దరికీ ఉండే క్రేజ్, ఫాలోయింగ్ మరియు ఫ్యాన్ బేస్ ను మరొక హీరోతో పోల్చలేమని అంటున్నారు. అయితే బన్నీ కూడా స్టార్ హీరోనే అయినప్పటికి, మహేష్ మరియు పవన్ లతో పోలిస్తే ఆయన, వారిద్దరి తరువాతి స్థానాల్లోనే ఉంటారని, కాబట్టి మహేష్ కు బన్నీ కి మధ్య పోటీ పెట్టలేమని అంటున్నారు. అయితే ఎంత క్రేజ్ వంటి విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ, చివరకు ఏ సినిమాలో అందరినీ అలరించే అంశాలు ఉంటె, చివరకు ప్రేక్షకులు ఆ సినిమాకే పట్టం కడతారు అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదని అంటున్నారు. మరి రాబోయే ఈ రసవత్తర పోరులో మహేష్, బన్నీ లలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: