మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా తన డ్రీం ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి చేసి విజయాన్ని అందుకున్నారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మించాడు. పదేళ్ల తర్వాత ముఖానికి రంగేసుకున్న చిరు ఖైది నంబర్ 150తోనే కాదు సైరాతో కూడా 100 కోట్ల మార్క్ మళ్లీ దాటేసి సంచలనం సృష్టించాడు.


ఇదిలాఉంటే సైరా తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు చిరంజీవి. ఈ మూవీ కూడా రాం చరణ్ నిర్మాణంలో వస్తుంది. అయితే ఈ సినిమాకు సహ నిర్మాతలుగా మ్యాట్నీ మూవీస్ వారు ఉంటున్నారు. ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.


అయితే కనీసం షూటింగ్ కూడా స్టార్ట్ చేయని ఈ సినిమాలో చిరంజీవి ఫస్ట్ లుక్.. సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ చిరు, కొరటాల శివ మూవీ టైటిల్ ఏంటి అంటే గోవిందా ఆచార్య  అని పెట్టారు. అయితే ఇది చిత్రయూనిట్ పెట్టిన టైటిల్ కాదు క్రేజీ మెగా ఫ్యాన్స్ పెట్టిన టైటిల్.


ఒక్క టైటిల్ మాత్రమేనా ఫస్ట్ లుక్ పొస్టర్ కూడా రిలీజ్ చేశారు. మెగా ఫ్యాన్స్ అంతా ఈ ఫస్ట్ లుక్ నిజమే అనుకుని షేర్ చేయడం మొదలుపెట్టారు. అసలు గోవిందం ఆచార్య అనే టైటిల్ ఎలా వచ్చిందో ఏమో కాని సినిమా నిర్మాతల్లో ఒకరైన మ్యాట్నీ మూవీస్ వారు ఈ పోస్టర్ చూసి సినిమా టైటిల్ అది కాదని. ఇంకా టైటిల్ దాకా ఆలోచించలేదని వివరణ ఇచ్చారు. అంతేకాదు సినిమా గురించి ఏదైనా ఉంటే అఫిషియల్ గా చెబుతామని కూడా అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: