తెలుగులో బిగ్ బాస్ సక్సస్ ఫుల్ షో అనే చెప్పాలి. సీజన్ 1 కి ఎన్.టి.ఆర్ హోస్ట్ చేశాడు. మొదటి సీజన్ అద్భుతంగా గ్రాండ్ సక్సస్ అయింది. తారక్ ని ఎప్పుడు సినిమాలలో పాటలు, ఫైట్లు డాన్సులు చూసిన ప్రేక్షకులకు ఈ రియాలిటి షో లో చాలా కొత్తగా కనిపించాడు. అంతేకాదు తన యాటిట్యూడ్ తో ఆక్టివ్ నేస్ తో వీకెండ్స్ జనాలని టీ.వి ముందు నుంచి కదలకుండా చేశాడు. ఇక సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హోస్టింగ్ చేశాడు. కానీ ఎందుకనో తారక్ లా నాని ఇమడలేకపోయాడు. దాంతో నాని బిగ్ బాస్ రియాలిటి షో కి హోస్ట్ గా సూటవ్వలేదన్న అభిప్రాయాలు జనాలలో వినిపించాయి. అందుకే ఈ సారి సీజన్ 3 కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తునారు. అంతేకాదు సీజన్ 3 ని అద్భుతంగా నడిపిస్తున్నారు. ఇక ఈ షో చివరి మూడు వారాలకు చేరుకుంది. 

హౌస్‌లో 7 గురు కంటెస్టెం ట్స్  లో రెండు వారాల్లో ఇద్దరు ఎలిమినేట్ కాగా.. చివరి వారంలో ఐదుగురు ఫైనల్ లో ఉంటారు. అయితే ఈ వారంలో వితిక కానీ, శివ జ్యోతి కానీ, బాబా భాస్కర్ కానీ బయటికి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఎక్కువగా వితికనే ఈ వారం ఎలిమినేట్ అవ్వొచ్చని అందరు అభిప్రాయపడుతున్నారు. ఇక టైటిల్ ఫేవర్ గా శ్రీముఖి, వరుణ్, రాహుల్ ఉండగా...మొదటినుండి రాహుల్‌ని టార్గెట్ చేసిన శ్రీముఖి.. మధ్యలో అతని పవర్ చూసి వెనక్కి తగ్గింది. కానీ మళ్ళీ ఎలిమినేషన్ టాస్క్‌లో కావాలని రాహుల్‌ని రెచ్చగొట్టింది. దానితో శ్రీముఖి పై ప్రేక్షకుల్లో నెగెటివ్ ఫీలింగ్స్ వచ్చేశాయి. ఇప్పుడిదే రాహుల్ కి బాగా కలిసొచ్చే అంశం అని తెలుస్తోంది. 

ఫైనల్‌గా టైటిల్ పోరు వరుణ్, రాహుల్ మధ్యనే జరిగబోతోందని సమాచారం. అయితే వరుణ్ కూడా పోయిన ఎలిమినేషన్ టాస్క్‌లో వితికాను సేవ్ చేసే క్రమంలో కూల్‌గా ఉండేవాడు కాస్త జ్యోతి విషయంలో తొందరపడ్డాడు. మొదటి నుండి హౌస్‌లో జరిగే గొడవలను సర్ది చెబుతూ వితికాను కంటెస్టెంట్‌గా చూసే వరుణ్ చివరిలో వితికాను భార్యలా చూడడం అతనిపై ప్రేక్షకుల్లో నెగిటివ్‌ థాట్ ను క్రియేట్ చేసింది. రాహుల్ కూడా సోలోగా శ్రీముఖి టార్గెట్‌ని అడ్డకుంటూ స్ట్రాంగ్‌గా నిలబడడంతో ఫైనల్ విన్నర్‌గా రాహుల్ నిలుస్తాడని అతనికి ప్రతి వారం పడే ఓటింగ్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ రకంగా చూస్తే బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ అని అందరు ఫిక్స్ అవుతున్నారు. అయితే ఆఖరి నిముషంలో ఏదైనా జరగవచ్చనిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: