ఒక్కరాత్రిలో స్టార్ హీరో అయ్యారు అంటే ఎవరు నమ్మరు కదా నిజమండి బాబు .. ఓ కుర్రాడు అయ్యాడు ..ఇంకా గుర్తుకు రావడంలేదు అర్జున్ రెడ్డి లాంటి రొమాంటిక్ కిల్లర్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ హీరో విజయ్ దేవరకొండ...ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తన పేరు వైరల్ అయింది. ఇకపోతే ఈ సినిమా ఇంత హిట్ అవ్వాలంటే ముఖ్యకారకుడు మాత్రం ఆ చిత్ర దర్శకుడు.. 


సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తన స్టైల్లో తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా పేరును సంపాదించాడు. అయితే ఆ సినిమా ను హిందీలో కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమాకు కబీర్ సింగ్ అని పేరు పెట్టారు. షాహిద్ కపూర్ , కీయరా అద్వానీ ఈ సినిమాలో నటించారు. ఈ సినోమా కూడా ఏ రేంజులో హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. 


ఇకపోతే సందీప్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. వరుస సినిమాను ప్రేక్షకులకు అందించడంలో బిజీగా ఉన్నాడు. ఇకపోతే మొన్న ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆయన విజయ్ దేవరకొండతో మరో సినిమా చేయబోతున్నదనే వార్తలు కూడా వస్తున్నాయి.. కేవలం పుకార్లే కాదు ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం వంగా సినిమా తీసున్నాడు ఈ సినిమా అయ్యాక విజయ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల బోతున్నాడు. 


ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. క్రాంతి మాధవన్ దర్శకత్వంలో బ్రేకర్ వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు . ఈ సినిమా తర్వాత పూరి జగన్నాద్ ఛార్మి నిర్మిస్తున్న సినిమాలో నటించునున్నాడు.. ఈ సినిమా తర్వాత సందీప్ సినిమా చేస్తారని సమాచారం ..


మరింత సమాచారం తెలుసుకోండి: