బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కాలేయ సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ తీవ్ర అస్వస్థతకు గురి కావటంతో అమితాబ్ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారని సమాచారం అందుతోంది. ముంబై నగరంలోని నానావతి ఆస్పత్రిలో అమితాబ్ బచ్చన్ కు చికిత్స జరుగుతోందని మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో అమితాబ్ బచ్చన్ ను ఆస్పత్రిలో చేర్చారని తెలుస్తోంది. 
 
కొన్ని రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్యానికి సంబంధించి షాకింగ్ విషయం బయటపెట్టారు. అమితాబ్ బచ్చన్ స్వస్థ్ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మాట్లాడుతూ తనకు క్షయ వ్యాధి సోకిన సంగతి వ్యాధి సోకిన 8 సంవత్సరాల వరకు తెలియదని, ఆలస్యంగా వైద్య పరీక్షలు చేయించుకోవటంతో వైద్య పరీక్షల్లో క్షయ వ్యాధి ఉందని తెలిసిందని అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు. 
 
రెగ్యులర్ గా మెడికల్ చెకప్ చేయించుకోకపోవటం వలన క్షయ సోకిందనే విషయం ఆలస్యంగా తెలిసిందని అన్నారు. ఇప్పటికే 75 శాతం లివర్ పూర్తిగా చెడిపోయిందని కేవలం 25 శాతం లివర్ తోనే సర్వైవ్ అవుతున్నానని అమితాబ్ బచ్చన్ గతంలో చెప్పారు. గత నెలలో కేంద్ర ప్రభుత్వం అమితాబ్ బచ్చన్ కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించింది. 
 
అమితాబ్ బచ్చన్ రెండు వారాల క్రితం తెలుగులో విడుదలైన సైరా నరసింహా రెడ్డి సినిమాలో గోసాయి వెంకన్న పాత్రలో నటించారు. సైరా సినిమాలో అమితాబ్ నటించటంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది. సైరా సినిమాకు అమితాబ్ రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదని తెలుస్తుంది. ప్రస్తుతం అమితాబ్ రణబీర్ కపూర్, అలియా భట్ కలిసి నటిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. గులాబో సితాబో సినిమాలో కూడా అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: