రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కథ గురించి స్వయంగా లీకులు ఇచ్చాడు. అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ల పాత్రల ప్రేరణతో తాను ఈ మూవీలో చరణ్ జూనియర్ ల పాత్రలను డిజైన్ చేసినట్లు స్వయంగా ప్రకటించాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు లీక్ అయింది.  

ఈ మూవీ మూల కథ చేగువేరా జీవితం ఆధారంగా తెరకకెక్కిన క్లాసిక్ ఫిలిం ‘మోటార్ సైకిల్ డైరీస్’  ను పోలి ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో చేగువేరా విప్లవ మార్గం ఎంచుకోక మునుపు తన స్నేహితుడితో కలిసి కొన్ని వేల కిలోమీటర్లు బైక్ జర్నీ చేస్తాడు.  ఆ ప్రయాణంలో కలిసిన మనుషులు జరిగిన సంఘటనలు చేగువేరా జీవితం పై ప్రభావం చూపిస్తాయి.  

అదేవిధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో చరణ్ జూనియర్లు కలిసి దేశం అంతా ప్రయాణిస్తూ అప్పటి బ్రిటీష్ అణిచివేత పరిస్థితులను గ్రహించి స్వాతంత్ర సమరయోదులుగా మారినట్లు చూపించే సీన్స్ ‘మోటార్ సైకిల్ డైరీస్’ మూవీ సీన్స్ ను పోలి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ను ప్రభావితం చేసిన వ్యక్తులలో చేగువీరా ప్రభావం చాల కీలకం. 

పవన్ స్వయంగా ఈవిషయాన్ని అనేకసార్లు తన ఉపన్యాసాలలో తెలియచేసాడు. అంతేకాదు ‘జనసేన’ పార్టీ సిద్ధాంతాలు కూడ చేగువేరా ఆలోచనలను కొంత వరకు పోలి ఉంటాయి. అలాంటి విప్లవ యోధుడు కథకు భారత స్వాతంత్రోద్యమ నేపధ్యంలో ఒక విప్లవాత్మక కథగా మార్చి రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ను తీస్తున్నాడు అని అంటున్నారు. దీనితో తమ అభిమాన హీరో పవన్ సిద్దాంతాలు ‘ఆర్ ఆర్ ఆర్’ లో కనిపించబోతున్నాయి అని తెలుసుకుని పవన్ వీరాభిమానులు జోష్ లో ఉన్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: