బిగ్ బాస్ హోటల్ టాస్క్ గురువారంతో పూర్తయింది. ఈ హోటల్ కి వచ్చిన కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో వందకి వందశాతం మార్కులు సాధించిన వారిలో ప్రథమంగా నిలిచేది వరుణ్ బామ్మ. బామ్మ రాకతో కంటెస్టెంట్స్ అందరూ చిన్నపిల్లల్లా అయిపోయారు. అందరూ ఆమె ముందు కూర్చుని ఏం చెప్తుందా అని వినసాగారు. ఈ వయసులో కూడ ఆమె చలాకీతనానికి హౌస్ మెంబర్స్ ఫిదా అయ్యారు. ఎవ్వర్నీ వదలకుండా ప్రతీ ఒక్కరికీ తనదైన శైలిలో చురకలు అంటిస్తూ అందర్నీ నవ్వించింది.


తన మాటల్లో వెటకారాన్ని మిళితం చేస్తూ బిగ్ బాస్ ని సైతం నవ్వించే ప్రయత్న చేసింది. ఇంటి నుండి బయటకు వెళ్లడానికి టైమ్ అయిందని బిగ్ బాస్ పిలిచినపుడు ఆమె వేసిన పంచ్ అదిరిపోయింది. బిగ్ బాస్ నుండి పిలుపు రాగానే, చటుక్కు న "బిగ్ బాస్ గారూ" మీరు మా ఇంటికి భోజనానికి రావాలని అనడంతో అక్కడున్న వారందరూ ఆమె హాస్య చతురతకి పడి పడి నవ్వారు. అంత వయసులోనూ బామ్మ అంత చలాకీగా ఉండటం, పాజిటివ్ గా ఉండటం అక్కడున్న వారందరిలో హుషారుని నింపింది.


ఇప్పటి వరకు జరిగిన ఎంటర్ టైన్ మెంట్ ఒక ఎత్తైతే, బామ్మ పంచిన ఆనందం మరో ఎత్తు. ఇప్పటి వరకు వచ్చిన వారందరూ తమ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడి వెళ్ళిపోయిన వాళ్ళే. కానీ బామ్మ ఒక్కతే అందరి సభ్యులని ముందు కూర్చోబెట్టుకుని వాళ్ళలో సంతోషాన్ని నింపింది. అయితే అంతా అయ్యాక వరుణ్ ని పక్కకి పిలిచి ఐదు నిమిషాలు మాట్లాడిన బామ్మ అతనికి గేమ్ లో కావాల్సిన సూచనలు అందించింది.


వరుణ్ తో మాట్లాడుతూ, గేమ్ చాలా బాగా ఆడుతున్నావని, మీరిద్దరూ ఇలానే ఆడాలని చెప్తుంది. ఇంకా, భార్యా భర్తలిద్దరూ ఒకరికోసం ఒకరు గేమ్ ఆడినట్లుగా ఉండకండి. ఎవరి గేమ్ వారు ఆడండి. అవతలి వాళ్ళకోసం గేమ్ ఆడటం ప్రేక్షకులకు నచ్చదు. అందుకని మీ గేమ్ మీరు ఆడండి. అందరితో బాగా ఉండండి అంటూ వరుణ్ కి హితబోధ చేసింది.ఇకపోతే వరుణ్ బామ్మగా వచ్చిన ఆమె, బిగ్ బాస్ బామ్మగా వెళ్ళిపోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: