అక్షయ్ కుమార్ నటిస్తున్న సినిమాల కథలు చాల డిఫరెంట్ గా ఉండటంతో ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరో స్థానానికి అతి దగ్గరలో ఉన్నాడు. తాను నటించే సినిమాల కథల విషయంలో ఎటువంటి సాహసానికైనా ఈ హీరో వెనుకాడడు. స్త్రీలు ఉపయోగించే సానిటరీ నేప్ కిన్స్ విషయంలో గ్రామీణ మహిళలలో అవగాహన పెంచడానికి ఇతడు నటించిన ఒక సినిమాతో అక్షయ్ పేరు మోడీ స్థాయి వరకు చేరిపోయింది.

ఇలాంటి పరిస్థితులలో ఈ దీపావళికి రాబోతున్న అక్షయ్ కుమార్ ‘హౌస్ ఫుల్ 4’ మూవీలో ఉండబోతున్న ‘ఏక్ చుమ్మా’ పాటను లేటెస్ట్ గా విడుదల చేసారు. ఈ పాటలో వచ్చే ఒక సీన్ లో అక్షయ్ పూజా హెగ్డే పాదాలను రోడ్డు మీద పడుకుని ముద్దు పెట్టుకుంటాడు. ఇప్పుడు అదే సీన్ ను అక్షయ్ పూజ హెగ్డే తో కలిసి ముంబాయ్ రోడ్లు మీద ఈ మూవీని ప్రమోట్ చేస్తూ పూజ హెగ్డే పాదాలను ముద్దు పెట్టుకునే సీన్ ను జనం మధ్య రిపీట్ చేయబోతున్నాడు. 

ఇప్పటికే విడుదలైన ఈ మూవీకి సంబంధించిన ‘ఏక్ చుమ్మా’ పాట వైరల్ అవ్వడమే కాకుండా ఈ సినిమా ప్రమోషన్ కోసం అక్షయ్ చేయబోతున్న ఈ సాహసం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. సినిమాల ప్రమోషన్ కోసం హీరోలు చాల కష్టపడతారు అన్న విషయం వాస్తవమే అయినా తన సినిమా ప్రమోషన్ కోసం ఒక హీరోయిన్ పాదాలను పబ్లిక్ గా రోడ్డు మీద పడుకుని ముద్దాడిన రికార్డు కూడ అక్షయ్ సొంతం కాబోతోంది. 

ఇప్పుడు ఈ న్యూస్ ఇలా వైరల్ కావడంతో ఇలాంటి సాహసం మన టాప్ హీరోలు చేయగలరా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. ఒక్క విజయ్ దేవరకొండ లాంటి హీరో తప్ప మరే హీరో ఇలాంటి సాహసాలు చేయలేదు. ఒకవేళ చేసినా అభిమానులు ఒప్పుకోరు..


మరింత సమాచారం తెలుసుకోండి: