తెలుగు సినిమా సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలక్రిష్ణలది ఓ టైప్ రేసింగ్. ఇద్దరు సీనియర్ హీరోలు 90 దశకంలో పోటాపోటీగా నటించారు. ఒకరిని ఒకరు చాలెంజ్  చేసుకున్నారు. ఓ దశలో చిరుకు దగ్గరగా వచ్చినట్లు అనిపించినా బాలయ్య మళ్ళీ వెనకబడేవాడు. దాంతో చిరంజీవి నంబర్ వన్ ప్లేస్  ఎప్పటికీ పదిలంగా ఉండిపోయింది.


ఈ నేపధ్యంలో చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తనదైన మెగామార్క్ చూపిస్తున్నాడు. చిరంజీవి 150 మూవీతో వంద కోట్ల క్లబ్ లో చాలా ఈజీగా చేరిపోయాడు. అప్పటికి పదేళ్ళుగా మేకప్ వేసుకోని చిరంజీవి, రాజకీయంగా ఇమేజ్ డ్యామేజ్ అయిందన్న విమర్శలు వచ్చిన చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి వస్తే ఆయన ప్లేస్ అలాగే ఉండడం కాకుండా యంగ్ హీరోలకు సవాల్ చేస్తూ ఈజీగా వంద కోట్ల కలెక్షన్లు రాబట్టాడు.


అదే సైరా మూవీతో మళ్లీ ఆ ఫీట్ ని సునాయాసంగా ఛేదించాడు. ఇపుడు మెగాస్టార్ మూవీ అంటే వందకోట్ల బొమ్మ అని  టాలీవుడ్ డిసైడ్ అయిపోయింది. ఈ నేపధ్యంలోచిరంజీవి కాలం నాటి హీరోలు అప్పటి నుంచి ఇప్పటివరకూ నటిస్తున్నా కూడా కనీసం యాభై కోట్ల క్లబ్ లో చేరలేకపోతున్నారు. అంటే చిరంజీవికి చాలా దూరంలో ఉండిపోయారనే చెప్పాలి. బాలయ్యకి శాతకర్ణి మూవీ కనీసం 70 కోట్లనైనా తెస్తుందని భావించినా అది యాభై కోట్ల లోపే ఆగిపోయింది. ఇక తండ్రి ఎన్టీయార్ పేరిట తీసిన బయోపిక్స్ ద్వారా వంద కోట్లు టార్గెట్ చేస్తే అది భారీ డిజాస్టర్ అయింది.


ఇక ఇపుడు బాలయ్య కె ఎస్ రవికుమార్ మూవీ చేస్తున్నాడు. కానీ ఇది మామూలు మూవీయే. హిట్ అయితే చాలన్న ఆలోచనలో చిత్ర‌ యూనిట్ ఉంది. మరి బాలయ్య వందకోట్ల టార్గెట్ అలాగే ఉంది. దాన్ని తనకు ఇష్టమైన డైరెక్టర్, రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చిన బోయపాటి తో చేస్తున్న హ్యాట్రిక్ మూవీతో తీర్చుకుంటాడని అంటున్నారు. ఆ మూవీని బాలయ్య ప్రెస్టిజియస్ గా తీసుకున్నారు. మరి ఈ మూవీతోనైనా బాలయ్య వంద కోట్ల కల తీరుతుందా..చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: