ఒక హీరో అభిమానులు మరో హీరో అభిమానులకి మధ్య గొడవలు జరగడం చాలాసార్లు చూశాం. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో ఇలాంటి ధోరణి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దళపతి విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. అయితే ఈ గొడవలకి సోషల్ మీడియా కేరాఫ్ అడ్రెస్ గా మారింది. సోషల్ మీడియా వేదికగా ఇద్దరి హీరోల అభిమానులు మరో హీరో పై నెగెటివ్ గా ప్రచారం చేస్తుంటారు.


ఇలాంటి సోషల్ మీడియా వార్ బాగా ఊపందుకునేలా చేసిన ఘనత  విజయ్, అజిత్ అభిమానులకే చెందుతుంది. తమ హీరో సినిమా కలెక్షన్ల కంటే ముందే యూట్యూబ్ లో లైక్స్, వ్యూస్ నుండి మొదలయ్యే ఈ యుద్ధం చాలా రోజుల వరకు కొనసాగుతుంది. యూట్యూబ్ లో రికార్డుల కోసం ఎక్కువ లైక్స్ కొట్టడం. ఎక్కువ వ్యూస్ పెంచే పనిలో ఉంటారు. సినిమా కలెక్షన్లను చెప్పుకున్నట్లే యూట్యూబ్ వ్యూస్, లైక్స్‌ను కూడా రికార్డులుగా చెప్పుకునే దుస్సంప్రదాయాన్ని మొదలు పెట్టింది వీళ్లే.


దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలకు కూడా లేని యూట్యూబ్ రికార్డులు విజయ్, అజిత్ సినిమాలకు ఉండటానికి కారణం ఈ అభిమానులే. అయితే ప్రస్తుతం విజయ్ సినిమా" బిగిల్" సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ అవనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యే రిలీజైంది. అయితే ఈ ట్రైలర్ కి ఎక్కడ లేని వ్యూస్ వచ్చాయి.రోజు రోజుకీ ఈ వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి.


వ్యూస్ సంగతి అటుంచితే ఈ సినిమాకి విపరీతంగా లైక్స్ వచ్చాయి. రెండు మిలియన్లకి దగ్గరలో లైక్స్ రావడంతో రంగంలోకి దిగిన అజిత్ అభిమానులు తాము అనుకున్నది చేశారు. ఒకవేళ బిగిల్ సినిమాకి రెండు మిలియన్ల లైక్స్ వస్తే, ఇండియాలో ఎక్కువ లైక్స్ వచ్చిన మొదటి చిత్రంగా బిగిల్ రికార్డు సృష్టించేది. ఇది గమనించిన అజిత్ ఫ్యాన్ అంతకు ముందు 1.9 లైక్స్ దగ్గర ఆగిపోయిన జీరో సినిమాకి లైక్స్ పెంచి దాన్ని రెండు మిలియన్ల లైక్స్ క్రాస్ చేసేలా చేశారు. దాంటో రెండు మిలియన్ల లైక్స్ క్రాస్ చేసిన మొదటి చిత్రంగా జీరో రికార్డు సృష్టించింది. బిగిల్ కూడా రెండు మిలియన్ల లైక్స్ దాటింది. కానీ ముందు క్రాస్ చేసింది మాత్రం "జీరో" సినిమానే.



మరింత సమాచారం తెలుసుకోండి: