తమిళ  స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ  బిగిల్.  ఈచిత్రం ఈనెల25న తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలకానుంది. ఇక ఇటీవల విడుదలైన  ట్రైలర్ ను చూస్తే   ఈ సినిమాను ఎంత క్వాలిటీ తో తీసారనే విషయం అర్థమైపోతుంది. అయితే ముందుగా ఈ చిత్రానికి 125కోట్ల బడ్జెట్ అనుకున్నారట.. కానీ షూటింగ్ స్టార్ట్  అయ్యాక  అంతకంతకు పెరిగి 180కోట్ల వరకు వచ్చిందట. దీనికి కారణం  డైరెక్టర్ అట్లీ ఓవర్ షూటింగే అని తెలుస్తుంది. నిజానికి ఈ చిత్రానికి  విజయ్ మొదట 70రోజుల డేట్స్  ఇచ్చాడు.  కానీ అట్లీ  ఓవర్ షూటింగ్  వల్ల విజయ్ ఎక్స్ట్రా గా 40రోజులు పనిచేయాల్సి వచ్చింది.  అలా ఈ సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. 


అయితే  ఎన్ని కోట్లు  ఖర్చు పెడితే ఏం లాభం సినిమా బాగుండాలి కదా.. ఈవిషయంలో మాత్రం  అట్లీ టీం  పాస్ అయిపోయిందట.  ఫైనల్ కాపీ చూసిన విజయ్  సినిమా పట్ల సంతోషం వ్యక్తం చేశాడట. ఇక 180కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాతలు కూడా  ప్రస్తుతం  సేఫ్ పొజిషన్ లోనే వున్నారు.  బిగిల్ తమిళ , తెలుగు వెర్షన్ ల థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం 200కోట్లని తేలింది. ఇక విజయ్ కి కోలీవుడ్ లో ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. దానికి తోడు సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం  బాక్సాఫీస్ వద్ద ఎదురుండదు. 



ఇదిలావుంటే  ఈ చిత్రం  తెలుగు లో విజిల్ పేరుతో విడుదలకానుంది. ఈచిత్రం పై తెలుగు ప్రేక్షకుల్లో కూడా  భారీ అంచనాలు వున్నాయి. దీపావళికి  పెద్ద సినిమాలు ఏవి విడుదలకాకపోవడం అలాగే తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదకానున్నడం తో విజిల్ అదిరిపోయే ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. దాంతో విజయ్ తెలుగు మార్కెట్ కూడా అమాంతం పెరగనుంది. ఏజిఎస్ ఎంటర్టైన్ మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: