నితిన్ హీరోగా మొట్టమొదటి సినిమా జయం సినిమాలో హీరోయిన్ గా నటించిన సదా ఆ తర్వాత అడపాదడపా విజయాలు సాధించి అపరిచితుడు సినిమాలో విక్రమ్ పక్కనహీరోయిన్ గా చేసి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు మొత్తం ప్లాప్ కావడంతో..కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన సదా తర్వాత టెలివిజన్ రంగంలో ఎంట్రీ ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలో ఇటీవల ఓ రియాల్టీ షో కి జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో అప్పట్లో సినిమాలు చేస్తున్న సందర్భంలో ఎక్కడా కూడా ఎక్స్పోజింగ్ లేకుండా వస్త్రధారణలో చాలా జాగ్రత్త వహిస్తూ అలాగే టెలివిజన్ రంగంలో కూడా డ్రెస్ విషయంలో చాలా పద్ధతిగా ఉండే హీరోయిన్ సదా తాజాగా బరితెగించి మరీ వేశ్య పాత్రలో నటించడంతో ఈ విషయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది.


తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. మొదట ఈ సినిమాకి టైటిల్ గా 'టార్చిలైట్' అనుకున్నారు. కానీ ఇప్పుడు 'శ్రీమతి 21F' అని మార్చారు. ఈ సినిమాలో సదా..  అర్థరాత్రి హైవేలపై విటుల కోసం ఎదురు చూసే క్యారెక్టర్‌లో కనిపించనుంది. ఓ వేశ్య జీవితానికి సంబంధించిన నిజమైన యదార్థమైన సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా లో అసలు ఆమె వేశ్యగా మరి హైవేలపై వ్యభిచారం చేసే స్థితికి ఎందుకు వచ్చింది అన్న కథాంశం పై ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం.


ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల కావటంతో ట్రైలర్ లో హీరోయిన్ సదా చాలా బోల్డ్ గా కనిపించారు. వేశ్య పాత్రలో సదా షాకింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. తన దగ్గరకి వచ్చిన విటుడితో.. ''జాకెట్ విప్పనా..? లేక నువ్వే విప్పుతావా..?'' అని అడుగుతూ బోల్డ్ సీన్స్ లో నటించింది. దీంతో ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: