ఇటీవల ప్రభాస్ హీరోగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన భారీ సినిమా సాహో అని అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉండగా సాహో సినిమా నిర్మాతలపై కేసు నమోదు కావడం జరిగింది. ఇంతకీ కేసు ఏమిటా అని చూస్తున్నారా...వివరాలు ఏమిటో చూద్దామా మరి... 


ప్రస్తుతం కార్పోరేట్ బ్రాండ్స్ కంపెనీ లతో పెద్ద స్టార్ హీరోల సినిమాలతో జట్టుకట్టడం సాధారణమైన విషయంగా మారింది.  సినిమాలో తమ బ్రాండ్ కు ప్రచారం కోసం కార్పోరేట్ బ్రాండ్స్ కంపెనీ వారు నిర్మాతలకు డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో  'సాహో' మేకర్స్ తో కూడా ఒక ఆర్కిటిక్ ఫాక్స్ అనే బ్యాగ్ కంపెనీ వారు ప్రమోషన్ కోసం రూ.1.40 కోట్లకు ఒప్పందం చేసుకున్నారంట. అయితే 'సాహో' ఫైనల్ కాపీ లో మాత్రం తమ బ్రాండ్ ప్రచారం ఎక్కడా కనిపించకపోవడంతో  బ్యాగ్ కంపెనీ వారు నిర్మాతలపై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది.


సాహో నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్రమ్ ఒక అగ్రిమెంట్ చేసుకుని ఆ తర్వాత దానిని అసలు  పట్టించుకోలేదని  కేసు నమోదు చేశాము అని ఆ సంస్థ ప్రతినిధులు తెలుపుతున్నారు. మా  కంపెనీకి సంబంధించిన బ్యాగులను సినిమాలో హీరో, హీరోయిన్లు వాడే విధంగా చుపిస్తాము అని చెప్పారు. కానీ, బ్యాగ్ లను సినిమాలో వాడలేదని, ప్రచారం కూడా చేయలేదు అందుకే  కేసు పెట్టాము అని సంస్థ వాళ్ళు చెప్పుకొని వస్తున్నారు.


సాహో నిర్మాతలు మమ్మల్నీ మోసం చేశారని  ఆరోపణలు చేస్తున్నారు సంస్థ వాళ్ళు. మాకు  న్యాయం చేయాలని సంస్థ వారు పోలీసులు కోరడం జరిగింది. హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో  ఈ కేసు సంబంధించి పూర్తి వివరాలు ఫైల్ అయ్యాయి. బ్యాగుల సంస్థ నుండి అందుకున్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టనున్నామని మాదాపూర్ ఇన్‌స్పెక్టర్‌  ఎస్‌.వెంకట్‌ రెడ్డి తెలియచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: