మెగాస్టార్ చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ కి ఆకాశమే హద్దు. ఆయనకు భారీ మాస్ ఇమేజ్ రావడానికి కొలమానంగా నిలిచిన చిత్రాల్లో రౌడీ అల్లుడు కూడా ఒకటి. ఇండస్ట్రీ హిట్ గ్యాంగ్ లీడర్ తర్వాత వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 1991 అక్టోబర్ 18న విడుదలైన ఈ సినిమా నేటితో 28 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 

 

 

ఈ సినిమాలో ఆటో జానీగా చిరంజీవి మాస్ నటన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో 'బాక్సు బద్దలైపోద్ది' అనే చిరంజీవి మేనరిజం ఓ సంచలనం. కోట, అల్లు రామలింగయ్యతో ఆయన చేసిన కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. బప్పీలహరి అందించిన ఆరు పాటలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. చిరంజీవి చేసిన డ్యూయల్ రోల్, మాస్ క్యారెక్టర్ అంతకుముందు చిరంజీవి చేసిన దొంగమొగుడు సినిమాను పోలి ఉంటుంది. అయినా చిరంజీవి వన్ మ్యాన్ షోతో సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. సాయిరాం ఆర్ట్స్ పతాకంపై వెంకటేశ్వర రావు, పంజా ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాను తన చెల్లెళ్ళ కోసమే ప్రత్యేకించి చేశానని లాభాలు మొత్తం వారికే అని అప్పట్లో చిరంజీవి ప్రకటించారు.

 

 

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శోభన, దివ్యభారతి హీరోయిన్లుగా నటించారు. 21 సెంటర్లలో శతదినోత్సవం జరుపుకున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్ మూవీ అని చెప్పొచ్చు. ఓ ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆ క్రేజ్ ని, హైప్ ని కంటిన్యూ చేసిన చిరంజీవి చిత్రాల్లో రౌడీ అల్లుడు ఒకటి. ఒంగోలులో ఈ సినిమా శతదినోత్సవ వేడుకలు జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: