అవికా గొర్ 2008లో కలర్స్ టివిలో "బాలికా వధు"(తెలుగులో చిన్నరి పెళ్ళికూతురుగా అనువాదమైనది) అనే హిందీ దారావాహికలొ నటించింది.ఆ తరువాత ఆమె "రాజ్‌కుమార్ ఆర్యన్" , "ససురాల్ సిమర్ కా" అనే దారావాహికలలో నటించారు.ఎపుడు అవికా గోరు ని చూడగానే ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ గుర్తుకు వస్తుంది. ఈ సీరియల్‌తో ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సీరియల్స్‌లో మాత్రమే కాకుండా హిందీ సినిమాల్లోనూ బాలనటిగా నటించింది.

అయితే, హీరోయిన్‌గా పరిచయం అయ్యింది మాత్రం తెలుగు ప్రేక్షకులకే. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో అవికా గోర్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.ఇంకా హీరోయిన్‌గా బలమైన పునాది వేసుకోలేదు. 


అయితే, తాజాగా ఆమె ‘రాజుగారి గది 3’లో హీరోయిన్‌గా నటించింది. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో అవికా గోర్‌ను ‘సమయం’ పలకరించింది. ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి ఆలోచనల గురించి అవికాను అడిగింది. దీనికి ఆమె చాలా సరదా సమాధానం ఇచ్చింది.‘‘ఇప్పటికే నాకు 20 సార్లు పెళ్లయింది. ఇప్పుడు పెళ్లి పేరు చెబితే నాకు అలసట వస్తోంది.అని నవ్వుతు సమాధానం ఇచ్చింది.

మరియు  నా వల్ల కాదు’’ అని నవ్వుతూ చెప్పింది అవికా.నిఖిల్ మంచి వ్యక్తి అని తెలుగు ఇండస్ట్రీలో తనకున్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో నిఖిల్ ఒకరని, ఆయనతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అవికా తెలిపింది.‘ఎక్కడికి పోతావు చిన్నవాడా?’ సినిమా టైమ్‌లో వచ్చిన రూమర్ల గురించి కూడా అవికా స్పందించింది.మరి ‘రాజుగారి గది 3' సినిమా తో  అయినా హీరోయిన్‌గా బలమైన పునాది వేస్కుంటదేమో చూడాలి.                                                                                                                               


మరింత సమాచారం తెలుసుకోండి: