బాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలున్నారు. కానీ వాళ్ళలో ఖిలాడిగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ కాస్త డిఫరెంట్. కెరీర్ బిగినింగ్ లో కేవలం యాక్షన్ సినిమాల హీరోగానే పేరు ఉన్నప్పటికీ గత కొన్నేళ్ళుగా తన ఇమేజ్ ని పూర్తిగా మార్చుకున్నాడు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ వరస హిట్లతో దూసుకుపోతున్నాడు. పేరుకి స్టార్ హీరో అయినా అక్షయ్ ఏమాత్రం స్టార్ డమ్ ను పట్టించుకునే రకం కాదని గత రెండేళ్ళుగా తను ఎంచుకున్న కథలను చూస్తే అర్థమవుతుంది. కేసరి, జాలీ ఎల్.ఎల్.బి, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మాన్,  మిషన్ మంగళ్.. వంటి సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఇక సినిమాలోని పాత్ర డిమాండ్ చేస్తే ఎలా నటించడానికైనా వెనకాడరు.  
 
అక్షయ నటించిన 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథా' సినిమా రిలీజుకు ముందు అందరు "అక్షయ్ ఇలాంటి సినిమా చేస్తున్నాడేంటి?" అనుకున్నారు. 'ప్యాడ్ మాన్' చేసినప్పుడు కూడా అలాంటి కామెంట్లే వినినిపించాయి. ఇప్పుడు ఇలాంటి కామెంట్లే మళ్ళీ వినిపిస్తున్నాయి. అక్షయ్ బాలీవుడ్ లో నటించిన 'హౌస్ ఫుల్ 4' సినిమాలోని  ఒక సీన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హౌస్ ఫుల్ ఫ్రాంచైజీలో 'హౌస్ ఫుల్ 4' ఈ నెల 25 న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా నుండి 'ఏక్ చుమ్మా' అంటూ సాగే లిరికల్ సాంగ్ ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. 

ఈ సాంగ్ లో అక్షయ్ కుమార్, బాబీ డియోల్, రితీష్ దేశ్ ముఖ్, పూజా హెగ్డే, కృతి సనన్, కృతి కర్బందా అందరూ అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంటారు. ఈ పాటలో ఒక సందర్భంలో అక్షయ్ నేలమీద కూర్చుని పూజ హెగ్డే పాదాలకు ముద్దు పెడతాడు. అప్పుడు పూజ తన కాలితో అక్షయ్ ఫేసును పైకి లేపుతుంది. హీరోయిన్ల చేత ఇలాంటి సీన్లు చేయిస్తే ఎంజాయ్ చేసే హీరోలు చాలామందే ఉన్నారు. కానీ ఇలా ఇమేజ్ ని ఏమాత్రం పట్టించుకోకుండా అక్షయ్ లాగా నటించే స్టార్ హీరోలు చాలా తక్కువమంది ఉన్నారు. అందుకే ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: