ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలి సిరీస్ రెండు సినిమాలు అత్యంత భారీ విజయాన్ని అందుకున్న తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో తారా స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఆ అంచనాలు అందుకునే విధంగా నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ ఖర్చుతో పాటు సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. 

ఇప్పటికే నలభై శాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్ కొమరం భీంగా, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్న ఈ సినిమాలో అలియాభట్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా, మరొక హీరోయిన్ ఎంపిక జరుగవలసి ఉంది. ఇకపోతే ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ కొద్దిరోజులుగా ఒక టైటిల్ పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. 

అయితే ఆ టైటిల్ ని ఆర్ఆర్ఆర్ టీమ్ నిర్ణయించ లేదని ఆ తరువాత తేలిపోయింది. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా టైటిల్ ని మరొక మూడు రోజుల్లో ఈ సినిమా యూనిట్ ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే అందుకు ఒక కారణం కూడా ఉందట, అదేమిటంటే, ఈనెల 22న కొమరం భీం జయంతి కావడంతో, ఆ రోజున తమ సినిమా టైటిల్ ని అఫీషియల్ గా ప్రకటిస్తే బాగుంటుందని, అలానే అదే రోజున ఈ సినిమాలో కొమరం భీంగా నటిస్తున్న ఎన్టీఆర్ లుక్ కూడా రిలీజ్ అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. ఒక వేళ ఈ వార్త కనుక నిజమే అయితే, మూవీ లవర్స్ కి ఇది పెద్ద పండుగ అనే అనాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: