విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారు, తండ్రికి తగ్గ తనయుడు అనే చెప్పాలి. తొలి సినిమా నుండి ఎంతో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలకృష్ణ గారు,  కెరీర్ పరంగా కొన్ని సక్సెస్ లతో పాటు మరికొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఎదుర్కున్నారు, తాను నటించిన సినిమాలతో ఎందరో అభిమానులను కూడా సంపాదించారు. ఇక ఇటీవల తన తండ్రి రామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల్లో నటించిన బాలకృష్ణ గారు, ప్రస్తుతం కేఎస్ రవికుమార్ గారి దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నారు. 

అయితే నేడు ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యంగ్ డైరెక్టర్ అల్లరి రవిబాబు, బాలకృష్ణ గారి గురించి, అలానే ఆయనతో గల అనుబంధాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. నిజానికి బాలకృష్ణ గారు ఎంతో సౌమ్యులని, ఆయనతో మాట్లాడుతున్నంతసేపు ఎంతో సరదాగా ఉంటుందని, ఎంత ఎదిగినప్పటికీ ప్రతి ఒక్కరిని బాలకృష్ణ గారు ఎంతో సాదరంగా పలకరిస్తూ మాట్లాడతారని అన్నారు. ఇక మొదటి నుండి తనకు బాలకృష్ణ గారితో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని అన్నారు. 

ఇక ఇటీవల ఆయన నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా రిలీజ్ తరువాత బాలకృష్ణ గారు సరదాగా ఫోన్ చేసి తనతో మాట్లాడుతూ, అందరితో సినిమాలు చేస్తున్నావు, మరి నాతో ఎప్పుడు చేస్తావు అని అడిగారని అన్నారు. ఆ మాట విన్న తనకు నిజంగా ఎంతో సంతోషం వేసిందని, నిజంగా ఆ అవకాశం కనుక తనకు వస్తే, తప్పకుండా ఆయనతో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా తీస్తా, అలానే దానికి పేరుగా ఐరన్ మ్యాన్ అని పెడతా అంటూ, తన మనసులోని మాటను ఆ ఇంటర్వ్యూ వేదికగా బయటపెట్టారు రవిబాబు. ఇక ప్రస్తుతం రవిబాబు తెరకెక్కిస్తున్న ఆవిరి సినిమా, అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: