వెంకీమామ.. పీపుల్స్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఇందులో భాస్వామ్యం గా ఉన్నారు. వెంకటేష్, నాగచైతన్య వంటి స్టార్ హీరోల తో పాటు భారీ స్టార్ కాస్టింగ్ వల్ల సినిమా విడుదల ఖర్చులు, పబ్లిసిటీ, వడ్డీలు అన్నీకలిసి 48-50 కోట్ల వరకు ఖర్చు అయినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఇప్పుడు ఈ సినిమాకు సరైన డేట్ ప్రకటించడంలో సతమతమవుతూ ఉన్నారు చిత్ర బృందం.  మరోపక్క ఈ సినిమాను ఆంధ్ర ఏరియాకు 18 కోట్ల రేంజ్ లో రేటు చెబుతున్నారని కూడా తెలుస్తోంది. అసలు ఇప్పటి వరకు సినిమా రిలీజ్ డేట్ తెలియడం లేదు గానీ రేటు చూస్తే మాత్రం అదిరిపోతోంది. అందువల్లనే బయ్యర్లు కూడా ముందుకు రావడంలేదట. డేట్ తెలిస్తేనన్న కనీసం ఎంతోకొంత కోట్ చేసే అవకాశం వుంది.
 
కానీ దాన్ని కూడా చెప్పకుండా సస్పెన్స్ లో ఉంచుతున్నారు. గతంలో సురేష్ పార్టనర్ షిప్ లో నిర్మించి ఎమ్ఎల్ఎ, ఓ బేబీ సినిమాలు కూడా అమ్మకుండా సురేష్ విడుదలే చేసారు. కానీ అవి విడుదలకు ముందే నాన్ థియేటర్ హక్కులతో బ్రేక్ ఈవెన్ అయిపోయాయి. అందువల్ల అక్కడ రిస్క్ లేదు. కానీ వెంకీమామ అలా కాదు జెమిని శాటిలైట్ ఎనిమిది కోట్లు వచ్చింది. హిందీ రైట్స్ ఎనిమిది కోట్లు అనుకున్నట్లు చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్లు ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే హిందీ మార్కెట్ పడిపోయిందని చెబుతూ, ముందు చెప్పిన రేట్లు హానర్ చేయడం లేదు. అమెజాన్ ద్వారా 6-7 కోట్లు వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది.

అందువల్ల ఎలా చూసినా, విడుదలకు ముందు పాతిక కోట్లకు లోపే వచ్చే అవకాశం వుంది. ఇలాంటి టైమ్ లో పీపుల్స్ మీడియా సేఫ్ గా వుండాలంటే థియేటర్ బిజినెస్ చేసేసుకోవడం చాలా మంచిది. కానీ మార్కెటింగ్ అంతా సురేష్ బాబు చేతిలో వుంది. రేటు కానీ, బయ్యర్లను కానీ ఆయనే ఫైనల్ చేయాలి. విడుదలకు ముందు కనుక మార్కెట్ చేసుకోకపోతే పాతిక కోట్ల టేబుల్ రిస్క్ తో విడుదల చేసుకోవాల్సి వుంటుందని ఇన్‌సైడ్ టాక్. వెంకీమామ డిసెంబర్ 13న విడుదల చేసే అవకాశాలు వున్నాయి. ఎందుకంటే ఆ రోజు వెంకీ బర్త్ డే. ఇప్పటి వరకు వెంకీ బర్త్ డే రోజున ఆయన సినిమా ఒక్కటీ విడుదల కాలేదు. ఇప్పుడు ఆ లోటు ఈ సినిమా తీర్చే అవకాశం వుందట. మరి ఆ డేట్ ని రిలీజ్ కి లాక్ చేస్తారా లేదా అన్నది మాత్రం ఇంకా తెలీలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: