బాలీవుడ్ లో ఇంతకముందు స్టార్ డైరెక్టర్స్ హవా నడిచేది. మన సౌత్ డైరెక్టర్స్ ని గాని, మన సినిమాలని అంతగా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పటికి కొన్ని ముంబాయ్ మీడియా వాళ్ళు మన సినిమా ని హిందీలో రిలీజ్ చేస్తే దారుణంగా రివ్యూలిస్తు అవమానిస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా సౌత్ ఇండియాలో తెరకెక్కుతున్న సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతు బాలీవుడ్ కి గట్టిపోటీ ఇస్తున్నాయి. అంతేకాదు సౌత్ ఇండియా లోని చిత్ర పరిశ్రమలు దేశవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంటున్నాయి.  అందుకు రోబో, బాహుబలి, సాహో, సైరా వంటి సినిమాలే ఉదాహరణలు. దశాబ్దాలుగా కొనసాగుతున్న బాలీవుడ్ అధిపత్యానికి గండికొడుతూ బలమైన పోటీగా ఎదిగింది. సౌత్ సినిమాలు నార్త్ ఇండియా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేస్తున్నాయి. 

దీనితో సౌత్ సినిమాలు అక్కడ బాగానే రీమేక్ అవుతున్నాయి. అంతేకాదు బాలీవుడ్ సూపర్ స్టార్స్ మన సౌత్ సినిమాలను రీమేక్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అలాగే సౌత్ ఇండియా దర్శకులను తమ సినిమాలకు డైరెక్టర్స్ గా ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో మన దర్శకులు అక్కడి వాళ్ళకు ఒకరకంగా చెక్ పెడుతున్నారనే చెప్పాలి. టాలీవుడ్ లో ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డి తోనే పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా,హిందీలో అదే సినిమాని షాహిద్ కపూర్-కియారా అద్వాని ల తో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ క్రేజ్ తో మరో సినిమా కూడా హిందీలో చేయడానికి సైన్ చేశారు. అవార్డు విన్నింగ్ మూవీ ప్రస్థానం సినిమాని దేవా కట్టా హిందీలో అదే టైటిల్ తో సంజయ్ దత్ హీరోగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవల రిలీజై తెలుగులో మాదిరిగా హిందీలోను విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక రాఘవ లారెన్స్ అక్షయ్ కుమార్ తో కాంచన రీమేక్ గా లక్ష్మీ బాంబ్ ను తెరకెక్కిస్తుండగా, అమిర్ ఖాన్ తో విక్రమ్ వేధా సినిమాని దర్శక దంపతులు పుష్పర్- గాయత్రీలు తెరకెక్కించనున్నారు. ఎప్పటినుండో హిందీలో డైరెక్టర్ గా సెటిల్ అయిన ప్రభుదేవా సల్మాన్ ఖాన్ తో దబాంగ్ 3 ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక తమిళ దర్శకుడు అట్లీ కూడా షారుక్ తో ఒక సినిమా చేయనున్నట్లు బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ మీడియా నుండి అందిన సమాచారం. ఇలా సౌత్ దర్శకులు హిందీ చిత్ర సీమలో మన సౌత్ జండా ఎగరేస్తున్నారు. రాబోవు రోజుల్లో మన సౌత్ నుండే ఎక్కువగా దర్శకులు బాలీవుడ్ లో సినిమాలను తెరకెక్కించే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. అంతేకాదు నిర్మాతలుగా దిల్ రాజు, అల్లు అరవింద్ సినిమాలను నిర్మిస్తుండటం ఆసక్తికరం. 


మరింత సమాచారం తెలుసుకోండి: