ఒక హీరో రిజెక్ట్ చేసిన కథ మరొక హీరోకి నచ్చి ఆ తరువాత ఆ కథతో తీసిన మూవీ సూపర్ హిట్ అయిన సందర్భాలు గతంలో చాల ఉన్నాయి. అయితే మహేష్ అల్లు అర్జున్ లు వేరువేరుగా రిజిక్ట్ చేసిన ఒక కథ ఇప్పుడు తమిళనాడులో సూపర్ హిట్ కాబోతోంది అంటూ కోలీవుడ్ మీడియా రాస్తున్న వార్తలు మహేష్ బన్నీలకు కూడ షాక్ ఇస్తున్నట్లు సమాచారం. 

ఇక వివరాలలోకి వెళితే తమిళ దర్శకుడు అట్లీ కుమార్ మహేష్ బన్నీలకు కథ చెప్పి  వారి చుట్టూ తిరిగితిరిగి విసిగిపోయిన కథ ఇప్పుడు దీపావళికి రాబోతున్న విజయ్ మూవీ ‘బిగిల్’ కథ అన్న ప్రచారం జరుగుతోంది. ఈ మూవీని ‘విజిల్’ పేరుతో తెలుగులో డబ్ చేసి దీపావళి రోజున ఇక్కడ కూడా విడుదల చేస్తున్నారు. 

గతంలో విజయ్ అట్లీల కాంబినేషన్ లో ‘తేరి’ ‘మెర్సల్’ మూవీలు దీపావళి రోజునే విడుదల అయి సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రాన్ని ఒలింపిక్స్ నేప‌థ్యంలో తీసారు. ఒలింపిక్స్ క్రీడల ఎంపిక విషయంలో జరిగే అన్యాయాలు ఈ మూవీలో చాల స్పష్టంగా చూపించినట్లు సమాచారం. ఈ సినిమాలో ఫుట్ బాల్ కోచ్‌గా విజ‌య్ కనిపిస్తాడు. ఈ సినిమాలోని సాక‌ర్ టీమ్ కోసం ఫుడ్ బాల్ లో అనుభవం ఉన్న 16 మంది అమ్మాయిలను తీసుకున్నాడు దర్శకుడు అట్లీ తీసుకున్నాడు.  

ఈ సినిమాకు ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తుంటే నయన తార విజయ్ తో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ డ్రామా మూవీలు హిట్ అవుతున్న నేపధ్యంలో ఈ మూవీ పై ప్రీ పాజిటివ్ టాక్ ఉంది. వాస్తవానికి ఈ కథ నచ్చినా అట్లీతో నటించే సాహసం చేయలేక మహేష్ ‘మహర్షి’ సినిమాను ఎంచుకున్నాడు. అదేవిధంగా బన్నీ కూడ అట్లీ తో సాహసం చేయలేక త్రివిక్రమ్ తో ‘అల వైకుంఠపురంలో’ మూవీ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు విజయ్ సినిమాకు ఏర్పడిన క్రేజ్ చూసి తాము ఈ కథను వదులుకుని పొరపాటు చేసామా అంటూ బన్నీ మహేష్ లు అంతర్మధనంలో ఉన్నట్లు సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: