‘ఎఫ్ 2’ తరువాత భారీ అంచనాలతో రాబోతున్న ‘వెంకీ మామ’ కష్టాలు ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దసరా సీజన్ కు వద్దామంటే ‘సైరా’ అడ్డంకి దీపావళి వద్దామంటే నెగిటివ్ సెంటిమెంట్ పోనీ సంక్రాంతికి వద్దాము అనుకుంటే బన్నీమహేష్ ల వార్ ఇలా రకరకాల కారణాలు ‘వెంకీ మామ’ ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో డిసెంబర్ 20న విడుదల అవ్వాలని ‘వెంకీ మామ’ ప్రయత్నిస్తున్నా ఆప్రయత్నాలకు నితిన్ రవితేజాలు సహకరించినా బాలకృష్ణ సాయి ధరమ్ తేజ్ లు సహకరించక పోవడంతో ఈమూవీకి ఎక్కడా సోలో డేట్ దొరకడంలేదు అని టాక్. ఈమూవీకి బయ్యర్ల నుండి మంచి స్పందన వస్తున్నా ఈమూవీ నిర్మాతలు చెపుతున్న రేట్లకు భయపడిపోతున్నట్లు టాక్. 

ఈమూవీకి పనిచేసిన వారంతా భారీ తారాగణం కావడంతో ఈమూవీ మేకింగ్ ఖర్చులు పబ్లిసిటీ వడ్డీలు అన్నీ కలుపుకుని సుమారు 48 కోట్ల వరకు అవుతుందని అంటున్నారు. దీనితో ఈమూవీ రేట్లను బాగా పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వెంకటేష్ కు ప్రస్తుతం క్రేజ్ బాగానే ఉన్నప్పటికీ ఈమూవీని సంక్రాంతికి విడుదల చేస్తే నిర్మాతలు కోరుకున్న రేట్లు ఇవ్వడానికి బయ్యర్లు రెడీ అవుతున్నట్లు సమాచారం.

అయితే ఈమూవీని డిసెంబర్ లో విడుదల చేస్తేఈ మూవీ నిర్మాతలు కోరుకున్న రేట్లు తాము ఇవ్వలేమని బయ్యర్లు స్పష్టం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా జరిగి ఈమూవీని తక్కువ రేట్లకు అమ్మితే ఈమూవీ విడుదల సమయంలోనే 25 కోట్ల రిస్క్ తో విడుదల చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతాయాని ఈమూవీ నిర్మాతలు టెన్షన్ పడుతున్నట్లు టాక్. ఈమూవీని సోలో రిలీజ్ గా డిసెంబర్ 13న విడుదల చేసే ఆలోచనలలో ఈమూవీ నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి బయ్యర్లు అంగీకరించకపోతే ఈమూవీని తామే సొంతంగా విడుదల చేసే ఆలోచనలు కూడ నిర్మాతలు చేస్తున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: