నిన్న విడుదలైన ‘రాజుగారి గది 3’ మూవీకి ఏవరేజ్ టాక్ రావడంతో ఈమూవీ వల్ల ఓంకార్ కు కాని అదేవిధంగా మూవీలో నటించిన అశ్విన్ కు కానీ ఏమాత్రం కలిసి వచ్చే అవకాశం లేదు. అయితే ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఓంకార్ అనేక మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమూవీలో నటించడానికి ఒప్పుకుని ప్రారంభోత్సవానికి కూడ వచ్చి ఆ తరువాత హ్యాండ్ ఇచ్చిన తమన్నా పై సెటైర్లు వేస్తున్నాడు. 

ఈవిషయాలు అన్నీ తమన్నా దృష్టి వరకు రావడంతో ఆమె ఓంకార్ కు ఫోన్ చేసి మెత్తటి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈమూవీ ప్రమోషన్ లో అనవసరంగా తన పేరు లాగవద్దని ఈమూవీ ఎందుకు వదులుకున్నానో ఓంకార్ కు తెలియదా అంటూ ఆమె ఓంకార్ కు ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ నుండి తమన్నా తప్పుకోవడానికి ప్రధాన కారణం ఒక డ్యూయెట్ సాంగ్ అని తెలుస్తోంది. 

వాస్తవానికి ఈమూవీలో నటించడానికి తమన్నా ఒప్పుకోకపోయినా ఆమెను చాల బలవంత పెట్టి ఓంకార్ ఒప్పించినట్లు తెలుస్తోంది. ఆమె ఈసినిమాలో ఒప్పుకునే సమయానికి ఇంకా ‘ఎఫ్ 2’ కూడ విడుదల కాలేదు. అయితే అప్పట్లో ఆమెకు అవకాశాలు లేకపోవడంతో తమన్నా ఈమూవీకి ఓకె చేసింది అని అంటారు. 

అయితే ఈ మూవీలో ఓంకార్ తన తమ్ముడు అశ్విన్ పాత్రను పెంచి తమన్నా పాత్రను తగ్గించి వేయడంతో పాటు అశ్విన్ కు తమన్నాతో ఒక రొమాంటిక్ సాంగ్ ను పెట్టడంతో తమన్నా భయపడి ఈ సినిమాను వదులుకుంది అని అంటారు. ఈమూవీలో తమన్నా ప్లేస్ లో వచ్చిన అవికా గోర్ అశ్విన్ లపై ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది. ఈపాటను చూసి ప్రేక్షకులు బెదిరిపోతున్నారు. అయితే అదే తమన్నా అవికా గోర్ స్థానంలో నటించి అశ్విన్ తో రోమాన్స్ చేస్తే ధియేటర్స్ లో ప్రేక్షకులు కూర్చుని చూడగలరా అంటూ జోక్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: