ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో ఉన్నంత పోటీ ఏ ఇండస్ట్రీలో కూడా లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం సరిలేరు నీకెవ్వరు తో సంక్రాంతి కి వస్తున్నారు .అదేవిధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అలా వైకుంటపురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

నిజానికి వెంకటేష్ మరియు నాగచైతన్య నటించిన వెంకీ మామ చిత్రం కూడా 12వ తారీకు రావాలనే ప్రయత్నం చేసింది కానీ ఆ రోజు రెండు పెద్ద సినిమాలు విడుదల ఉన్నందుకు తిరిగి ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది.దీనికి తోడు కళ్యాణ్ రామ్ కూడా సంక్రాంతి బరిలో ఉండాలని చూస్తున్నాడు మరియు  తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ గారు దర్బార్ సినిమాతో రావాలి అని అనుకుంటున్నారు .


దీనితో ఇప్పుడు టాలీవుడ్ లోని చిన్న సినిమాలు అన్నీ కూడా డిసెంబర్ నెలలో టార్గెట్  చేసుకుంటున్నాయి .నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్, సమంత మరియు శర్వానంద్ జంటగా నటించిన 96 రీమేక్ మూవీ, రవితేజ నటించిన డిస్కో రాజా మూవీ, సాయి ధర్మ తేజ్ రాసి కన్నా జంటగా నటించిన ప్రతి రోజు పండగే చిత్రం, నితిన్ రష్మిక జంటగా నటించిన భీష్మ సినిమా అన్ని కూడా డిసెంబర్ నెల ను టార్గెట్ చేసుకున్నాయి .క్రిస్మస్ సెలవులు  మరియు జనవరి ఫస్ట్ హాలిడే సీజన్ ని ఈ చిన్న సినిమాలు క్యాష్ చేసుకోవాలనే చూస్తున్నాయి .

మొత్తం మీద ఈ సారి మాత్రం డిసెంబర్ చాలా క్రేజీగా మారింది అరడజను పైగా సినిమాలు డిసెంబర్లోనే పోటీపడుతున్నాయి. కానీ ఏ సినిమా కూడా ఇంతవరకు డేట్స్ కన్ఫర్మ్ కాలేదు. ఇలా డిసెంబర్ నెలలోనే ఆరడజన్ సినిమాలు రావడం టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది


మరింత సమాచారం తెలుసుకోండి: