బాహుబలి లాంటి ప్రపంచవ్యాప్త భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా RRR. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి మొట్టమొదటిసారి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కీలకపాత్రలో నటిస్తున్నారు. మొట్టమొదటిసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి మరియు మెగా కుటుంబానికి చెందిన మేం హీరోలు కలిసి నటిస్తున్న నేపధ్యంలో ఈ సినిమా పై అంచనాలు బీభత్సంగా నెలకొన్నాయి.


దీంతో అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఈ సినిమా షూటింగ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ 40 శాతం వరకు పూర్తి అయినట్లు సమాచారం. మొన్నటి వరకు జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకు గాయాలు కావడంతో షూటింగ్ వాయిదా పడింది. అయితే ఇద్దరు హీరోలు గాయాల నుండి తెలుకోవడంతో ఈ సినిమాని అనుకున్న సమయానికి ఈ కంప్లీట్ చేయడానికి రాజమౌళి చాలా శరవేగంగా సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఇటీవలే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో షెడ్యూల్ కి ప్లాన్ చేస్తున్నారు జక్కన్న.


ఇదిలా ఉండగా ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఇదేనంటూ గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో ప్రచారం జోరుగా సాగుతుంది. కానీ అవన్నీ కూడా అసత్య ప్రచారాలని దర్శక నిర్మాతలు కొట్టిపారేశారు. అయితే ఈమేరకు మరొక మూడు రోజుల్లో ఈ చిత్ర టైటిల్ ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఎందుకంటే ఈనెల 22 న కొమురం భీం జయంతి కావడంతో, కొమురం భీం పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తో పాటు ఈ సినిమా టైటిల్ ని కూడా ప్రకటించనున్నారని సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: