విజయ్ దేవరకొండ ని ఇండస్ట్రీలో నిలబెట్టిన సినిమా పెళ్లిచూపులు ఈ సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇప్పుడు విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న మీకు మాత్రమే ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బడా నిర్మాత దిల్ రాజు తన సినీ ప్రయాణం ని  డైరెక్టర్ వి.వి.వినాయక్  దర్శకత్వం వహించిన దిల్ సినిమా తో మొదలు అయింది . రాజు తన తొలి సినిమా పేరే తన ఇంటి పేరుగా మరేఅంతగా ఆ సినిమా తన మీద ప్రభావం చూపించింది .


డైరెక్టర్ గా ఛాన్సులు లేక ఇబ్బంది పడుతున్న వినాయక ఇప్పుడు తానే  హీరో గా మారి 'శీనయ్య' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని దిల్ రాజు స్వయంగా నిర్మిస్తున్నారు ఒకరకంగా ఇది వినాయక్ కి రాజుగారు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అని అనుకుంటున్నాము.


 ఇక  ఇండస్ట్రీలో రౌడీ హీరో అయిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు ముందు చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండేవాడు కానీ తరుణ్ భాస్కర్ తీసిన పెళ్లిచూపులు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు మన రౌడీ హీరో .ఇప్పుడు విజయ్ దేవరకొండ తను సినిమాలో సాధించిన డబ్బులతో తరుణ్ భాస్కర్ హీరోగా 'మీకు మాత్రమే చెప్తాను' అనే సినిమాని నిర్మిస్తున్నాడు ఆ విధంగా విజయ్ దేవరకొండ తన కష్టాన్ని ఇచ్చాను తరుణ్ భాస్కర్ కి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పనిలో ఉన్నాడు. ఈ సినిమా నవంబర్ లో విడుదల అవుతుందని తెలిసిందే.


 అలాగే ఈ రెండు సినిమాలతో తమ  కెరియర్ మొదట్లో తమకి సాయం చేసిన వారిని మర్చిపోకుండా వారిని కూడా నిలబెట్టే ప్రయత్నాలు వీళ్లిద్దరు చేస్తూ ఉండటం ఇండస్ట్రీలో ఎంతో శుభపరిణామం. చూడాలి వీరి లాగే ఇంకా చాలామంది ఏమన్న సినిమాలు నిర్మిస్తారు ఏమో .


మరింత సమాచారం తెలుసుకోండి: