మెంటల్ మదిలో సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వివేక్ ఆత్రేయ మంచి సినిమా తీసి మంచి మార్కులే పొందాడు .కథ బాగా ఉన్నా రెండవ భాగం లో  కొంచెం తేడా కొట్టడంతో సినిమా అనుకున్న స్థాయికి వెళ్ళలేక పోయింది. కానీ  ఆ తరువాత కొంచెం గ్యాప్ తీసుకొని శ్రీ విష్ణు నటించిన బ్రోచేవారెవరురా అనే ఒక కామెడీ క్రైమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.


 నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ కొడుకు బెల్లంకొండ గణేష్ ఈ మధ్యనే గ్రాండ్ గా లాంచ్ అయిన విషయం అందరికీ తెలిసింది .ఈ సినిమాకి పవన్ సాధినేని అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఈ సినిమా పిరియాడిక్ లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో తీస్తున్నాడు పవన్ సాధినేని .ఇప్పుడు వివేక్ ఆత్రేయ సపోర్ట్ తీసుకుంటున్నాడు  స్క్రిప్ట్ డిస్కషన్ నుంచి స్టోరీలైన్ వరకు అన్నింటిలో వివేక్ ఈ సినిమాలో పవన్ సాధినేని  కి సపోర్ట్ గా ఉన్నాడు ప్రెస్ కు రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా తన పేరు వేశారు.

దర్శకుడు పవన్ సాదినేని కి వివేక్ చాలా మంచి మిత్రుడు కాబట్టి వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే నిర్మాతలు కూడా అతనికి రెమ్యునరేషన్ ఇవ్వడానికి వెనుకాడలేదు .వారు వీరిద్దరి టాలెంట్ ను కలిపి గణేష్ కి ఎలాగైనా హిట్ ఇవ్వాలని ఆశతో ఉన్నారని తెలుస్తోంది .

బెల్లంకొండ అన్న అయిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈ మధ్యనే తన తొలి కమర్షియల్ విజయాన్ని రాక్షసుడు సినిమాతో విజయం సాధించాడు. ఈ విజయం  కోసం తను దాదాపు ఐదు సంవత్సరాల పైగా అని ఎదురు చూడవలసి వచ్చింది చూడాలి తమ్ముడు ఎన్ని రోజులు వేచి చూసాడు


మరింత సమాచారం తెలుసుకోండి: