తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటించే పెద్ద పెద్ద సినిమాల బాక్సాఫీస్ ఫలితంతో అనుబంధం లేకుండా  టెలివిజన్లో  మంచి రేటింగ్సే లభిస్తుంటాయి. ఇక సినిమా కంటెంట్ ఎలా ఉన్నా సరాసరిగా  14-15 మధ్య రేటింగ్స్ లభించే  సత్తా ఉంది మన తెలుగు స్టార్లకు. 


ఇక హిట్ సినిమాలకు మాత్రం  20కి అటు ఇటుగా టీఆర్పీ లభించడం కూడా చూసాము. కానీ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల జోరు పెరిగాక ఆ ప్రభావం థియేట్రికల్ మీదే కాదు.. టెలివిజన్ రేటింగ్స్ మీద కూడా బాగా ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు నిదర్శనం మహేష్ బాబు కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘మహర్షి’ సినిమాకు వచ్చిన  రేటింగ్ ద్వారా తెలుస్తుంది. ఇటీవలే ‘మహర్షి’ సినిమాని  ఓ ఛానెల్లో ప్రిమియర్ షో కూడా వేయడం జరిగింది.


ఈ సినిమాకి  10 లోపు టీఆర్పీ రావడం పెద్ద షాకింగ్‌గా మారింది. కేవలం 9.2 రేటింగ్‌ దగ్గర నిలిచిపోయింది.  ఇప్పటి వరుకు  థియేటర్లలో హిట్ సినిమా అయిన ఏ పెద్ద హీరో సినిమాకూ ఇంత తక్కువ రేటింగ్ రాలేదు అని తెలుస్తుంది. ఇక ప్రిన్స్ మహేష్ సినిమా టీఆర్పీ రేటింగ్స్ చుస్తే అతడి ఆల్ టైం డిజాస్టర్ ‘బ్రహ్మోత్సవం’కు చాల తగ్గువగా  7.52 రేటింగ్ లభించింది. దాని తర్వాత మహేష్ సినిమాల్లో అతి తగ్గువా  రేటింగ్ వచ్చింది ‘మహర్షి’ సినిమాకి. మహర్షి సినిమా థియేటర్లలో రిలీజ్ సమయంలో మంచి పేరు వచ్చింది. ఇక థియేటర్లలో  కూడా బాగా మంచి పేరు  రావడం జరిగింది.


 అయితే థియేటర్లలో ఎక్కువ కాలం సినిమా రావడం.. ఆ తర్వాత అమేజాన్ ప్రైమ్‌లో కూడా రిలీజ్ అవ్వడంతో ప్రేక్షకులు  బాగా చూడడం వాళ్ళ టెలివిజన్ రేటింగ్ మీద ప్రభావం చూపించ వచ్చు అని అభిప్రాయం పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: