కృష్ణ మరియు ఎల్సా ఘోష జంటగా నటించిన సినిమా కృష్ణారావు సూపర్ మార్కెట్ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సినిమాకి యువ దర్శకుడు శ్రీనాథ్ పులకరం దర్శకత్వం వహించాడు .ఈ సినిమా రివ్యూ లోకి వెళ్దాం సినిమా లో  కిక్ బాక్సింగ్ ట్రైనర్గ  కృష్ణ కనిపించాడు అతను ఎల్సా గోస్ తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటన వల్ల వాళ్ళ ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి తర్వాత ఒకటి అయ్యి హ్యాపీ అనుకుంటున్న సమయంలో . సడన్ గ  ఒక సైకో కిల్లర్ హీరోయిన్  హత్య చేస్తాడు. హీరో లైఫ్ ఎలా మారింది ?అసలు ఆ సైకో కిల్లర్ ఎందుకు చంపాడు?? హీరో ఆ హంతుకుడుపై  ప్రతీకారం తీర్చుకుంటాడు?? ఇలాంటి విషయాలతో సినిమా నడిచింది


సినిమాలో హీరో చక్కగా కనిపించాడు. అతను కొన్ని దృశ్యాలు చాలా బాగా వచ్చాయి మొదటి సినిమా అయినా తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ చాలా అందంగా కనిపించింది .తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది, బీచ్ సాంగ్ లో తన గ్లామర్ షో తో యూత్ ని బాగా అట్రాక్ట్ చేసింది. నటుడు తనికెళ్ల భరణి ,రవిప్రకాష్ ,గౌతంరాజు మరియు మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు.

మంచి స్టోరీ లైన్ తీసుకున్నాడు కానీ దాన్ని పూర్తిగా కథాకథనాలు రాసుకో లేకపోయిడు  దర్శకుడు. సినిమాని ఇంకా ఆసక్తికరంగా మలిచిన అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా పని చేయలేదు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు తప్ప మిగతావి ఏమి అంతగా ఆకట్టుకునే విధంగా లేవు. ఓవరాల్గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొడుతూ ఉంటుంది.

దర్శకుడు స్క్రిప్ట్పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుంది. బోలె  శవాలై  అందించిన నేపధ్య సంగీతం పరవాలేదనిపించింది. మంచి పేరున్న మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ కూడా ఏమాత్రం బాగాలేదు, చాలా సన్నివేశాల్లో ఎడిటింగ్ చేసి ఉంటే టైం తగ్గించే అవకాశం ఉండేది నిర్మాణ విలువలు కూడా ఏమంత గా చెప్పుకునే విధంగా లేవు


మరింత సమాచారం తెలుసుకోండి: