కోలీవుడ్ టాప్ స్టార్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం బిగిల్.. తెలుగులో సినిమా విజిల్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో వీరి కాంబినేషన్ సూపర్ హిట్ కావడంతో ఆశలుతో ఉన్నారు.అయితే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.
తమిళ్ దర్శకుడు అట్లీ తన సినిమా కథ ని కాపీ చేసారు అని తెలుగు లఘు సినిమా దర్శకుడు చిన్ని
కుమార్ ఆరోపించారు. తమిళంలో బిగిల్ గా విడుదలవుతున్న ఈ సినిమాలో
విజయ్ సరసన
నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ఈనెల 25న విడుదలవుతుంది.అయితే ప్రతి సినిమాలాగే ఈ సినిమా కూడా విడుదలకు ముందు వివాదాలను ఎదుర్కొంటుంది.
ఈ సినిమా కథ తనదే అంటూ ఓ రచయిత, దర్శకుడు తెలంగాణ రచయితల సంఘంలో కంప్లయింట్ చేశాడు. తెలుగులో పలు షార్ట్ ఫిలింస్‌కు దర్శకత్వం వహించిన నంది చిన్ని కుమార్ అనే వ్యక్తి ఈ ఆరోపణలు చేస్తున్నాడు. అంతేకాదు బిగిల్ చిత్రయూనిట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నాడు.అయితే విజిల్ సినిమాపై ఇప్పటికే దర్శకుడు కెపి సెల్వ కేసు పెట్టారు. తన కాపీ కొట్టి ఈ సినిమా తీశారని మద్రాస్ హై కోర్టులో పిటిషన్ వేశారు.