టాలీవుడ్ లో ఓటమెరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాజమౌళి. తీసిన సినిమాలన్నీ భారీ విజయం సాధించడంతో దర్శక దిగ్గజం గా మారిపోయాడు. రాజమౌళి అంటే సక్సెస్... సక్సెస్ అంటే రాజమౌళి. ఓ బడా హీరోని పెట్టి సినిమా తీసినా విజయం సాధించగలరు... ఒక కమిడియన్ ని హీరోగా పెట్టి సినిమా తీసిన విజయం సాధించగలడు ... చివరికి ఒక ఈగ ను పెట్టయినా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు  రాజమౌళి. అయితే  మొన్నటి వరకు టాలీవుడ్ లో మాత్రమే ఉన్న రాజమౌళి క్రేజ్... బాహుబలి వరల్డ్ వైడ్ సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రపంచ నలుమూలలకు పాకింది. బాహుబలి తర్వాత రాజమౌళి  నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి కళ్ళు ఉన్నాయి. 

 

 

 

 

 ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా టాలీవుడ్ టాప్ హీరోలు అయిన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లతో అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ జీవిత కథను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్ర వర్కింగ్ టైటిల్ ని ఆర్ ఆర్ ఆర్  గా ఫిక్స్ చేశారు చిత్ర బృందం. కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే సంవత్సరం జూలైలో విడుదల కాబోతున్నట్లు  సమాచారం. కాగా ఈ సినిమా టైటిల్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు వచ్చాయి. 

 

 

 

 

 ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించి 40 శాతం షూటింగ్ కూడా పూర్తయింది. అయితే  ఈ సినిమా టైటిల్ పై ఎన్నో ఊహాగానాలు వస్తుండడంతో... ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే అఫీషియల్ గా వెల్లడించేందుకు  రాజమౌళి భావిస్తోన్నారట . మరో మూడు రోజుల్లో  ఈ చిత్ర టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ నెల 22న కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఫస్ట్  లుక్ తో పాటు సినిమా టైటిల్ ని  కూడా ఆఫీసియల్ గా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో  చర్చ నడుస్తుంది. ఒకవేళ కొమరం భీమ్ జయంతి సందర్భంగా టైటిల్ ని విడుదల చేయక పోయినా... దీపావళికి మాత్రం ఖచ్చితంగా టైటిల్ అఫీషియల్గా ప్రకటించి  ఈ సినిమా టైటిల్ జనాల్లోకి బలంగా తీసుకెళ్లడానికి జక్కన్న మరియు చిత్ర బృందం  ప్రయత్నిస్తుందట .

మరింత సమాచారం తెలుసుకోండి: