తమిళ అగ్ర హీరో విజయ్ గురించి తెలియని వారు లేరు. తమిళ్ లో ఇతని క్రేజ్ అంత ఇంతా కాదు. ఇతనితో సినిమా తీస్తే కలెక్షన్స్ పక్కా.. అయితే ఇతని ముందున్న చిన్న స్థాయి హీరోలు చాలా సినిమాలు తెలుగులో డబ్ చేసుకొని ఎప్పుడో క్రేజ్ సంపాదించారు. వారి మార్కెట్ ను తెలుగులో పెంచుకున్నారు. కానీ తమిళ అగ్ర హీరో విజ‌య్ కు మాత్రం ఇక్క‌డ గుర్తింపు సంపాదించ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఒక‌ప్పుడు అత‌డి సినిమాలు ఇక్క‌డ రిలీజ్ కావ‌డ‌మే ఓ వింతలా ఉండేది. ఒకవేళ విడుదలైన మ‌న జ‌నం ప‌ట్టించుకునేవాళ్లు కాదు. ఐతే గ‌త కొన్నేళ్ల‌లో మాత్రం ప‌రిస్థితి పూర్తిగా మారింది.

 

స్నేహితుడు, తుపాకి, జిల్లా, అదిరింది, స‌ర్కార్ వంటి కొన్ని సినిమాల‌తో నెమ్మ‌దిగా తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ సంపాదించుకొని., గ‌త ఏడాది స‌ర్కార్ సినిమా డివైడ్ టాక్‌తోనూ మంచి వ‌సూళ్లను సాధించి., ఇక్కడ రిలీజ్ చేసిన నిర్మాత‌కు మంచి లాభాలనే తెచ్చి పెట్టాడు మన విజయ్. ఇప్పుడు విజ‌య్ నటించబోతున్న మరో కొత్త సినిమా విజిల్‌కు ఇంకా మంచి క్రేజ్ వ‌చ్చింది.

 

విజ‌య్ సినిమాల హ‌క్కులు ఒక‌ప్పుడు కోటి రెండు కోట్లు పలకగా..,, అదిరింది సినిమాకు దాదాపు రూ.5.5 కోట్ల రేటు ప‌లికింది. స‌ర్కార్‌కు 7 కోట్ల వరకు వ‌ర్క‌వుట్ అయింది. ఇప్పుడు విజిల్ పాత రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లు కొట్టేసింది. విజ‌య్ కెరీర్లో తొలిసారిగా డ‌బుల్ డిజిట్ ఫిగ‌ర్‌కు రేటు పెర‌గి., విజిల్‌కు తెలుగు రాష్ట్రాల్లో రూ.10.6 కోట్ల బిజినెస్ జ‌ర‌గ‌డం విశేషం. దీన్నిబట్టి ఈ సినిమా విజ‌య్ కెరీర్ బెస్ట్ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

 

దీపావ‌ళికి తెలుగు సినిమాలేవీ షెడ్యూల్ కాక‌పోవ‌డం, విజిల్‌కు మ‌న ద‌గ్గ‌రా మంచి క్రేజ్ ఉండ‌టంతో భారీగానే సినిమాను రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలవుతున్నారు. ఈ చిత్రాన్ని పీఆర్వో ట‌ర్న్డ్ ప్రొడ్యూస‌ర్ మ‌హేష్ కోనేరు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయగా., అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: