సిని పరిశ్రమలో హిట్టు పడ్డది అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. డెబ్యూ మూవీతో హిట్టు పడితే మాత్రం వరుస అవకాశాలు వచ్చేస్తాయి. అయితే మొదటి రెండు సినిమాలు హిట్టు కాకున్నా సరే మూడవ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నా అమ్మడికి లక్ కలిసి రావట్లేదు. ఇంతకీ ఎవరా అమ్మడు అంటే నిధి అగర్వాల్ అని అంటున్నారు.


మోడలింగ్ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ అక్కినేని సోదరులు ఇద్దరితో సినిమాలు చేసింది. ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో నిధిని ఐరన్ లెగ్ అనేశారు. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ హిట్ అవడంతో అమ్మడు దశ తిరుగుతుందని అనుకున్నారు. రాం హీరోగా పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్ హిట్ అందుకుంది నిధి అగర్వాల్. 


ఆ సినిమాలో నిధి అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నిధితో పాటుగా ఆ సినిమాలో నభా నటేష్ కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇదిలాఉంటే ఇస్మార్ట్ హిట్టు పడ్డాక నభా మాస్ మహరాజ్ రవితేజ సినిమాలో ఛాన్స్ అందుకుంది. కాని నిధి అగర్వాల్ కు మాత్రం ఒక్క ఛాన్స్ రాలేదు. ఎలాంటి పాత్రలకైనా తాను సరే అని చెబుతున్నా సరే నిధి అగర్వాల్ కు మాత్రం అవకాశాలు అందట్లేదు. 


ఇక క్రికెటర్ రాహుల్ తో అమ్మడు డేటింగ్ లాంటి కామెంట్స్ వినిపిస్తున్నా సరే మా మధ్య అలాంటిది ఏమి లేదని చెప్పింది. అందం అభినయం రెండు ఉన్న నిధి తర్వాత సినిమా కూడా హిట్టు పడితే మాత్రం మళ్లీ అవకాశాలు క్యూ కడతాయి. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉండగా తప్పకుండా నిధి తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: