బాలీవుడ్ సినిమాలనే కాదు అక్కడ రియాలిటీ షోలకు, ప్రోగ్రాం కాన్సెప్ట్ లను వాడేస్తున్నారు. ఇప్పటికే అలాంటి షోలు బాగానే వస్తుండగా లేటెస్ట్ గా ఫీట్ అప్ విత్ స్టార్స్ షో కూడా తెలుగులోకి వచ్చేసింది. ఈ షోకి మంచు లక్ష్మి హోస్ట్ గా చేస్తుంది. ఫీట్ అప్ విత్ స్టార్స్ అంటే స్టార్స్ వారి బెడ్ రూం సీక్రెట్స్ ను బయట పెట్టడం అన్నమాట.


ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఈ షోలో పాల్గొన్నారు. అయితే లేటెస్ట్ గా ఈ షోలో పాల్గొన్న నిఖిల్ మాత్రం మంచు లక్ష్మి మీద రివర్స్ కామెంట్స్ చేశాడు. ఆమె పిలిస్తే ఇండస్ట్రీలో ఏ హీరో అయినా వెళ్లాల్సిందే. రాకపోతే కైమా చేస్తుందని అన్నాడు. నైట్ డ్రెస్ మీద రండని చెబుతుందని అన్నాడు నిఖిల్. నైట్ డ్రెస్ వేసుకుని గంట రమ్మంటుంది అని నిఖిల్ ఈ షో గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. 


మంచు మోహన్ బాబు తనయురాలిగా మంచు లక్ష్మి తండ్రికి తగ్గ తనయురాలని చెప్పొచ్చు. నిర్మాతగా, నటిగా, టివి హోస్ట్ గా అన్ని విభాగాల్లో ఆమె పర్ఫెక్ట్ అనిపించుకుంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న ఫీట్ అప్ విత్ స్టార్స్ షో సూపర్ హిట్ అయ్యింది. స్టార్స్ వారి పర్సనల్ లైఫ్ సీక్రెట్స్ తో షో మరింత ఆసక్తి కలిగించేలా చేస్తుంది.


అయితే ప్రస్తుతం వూట్ యాప్ లో వస్తున్న ఈ షోని ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ చేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయట. మంచు లక్ష్మి ఇదవరకు కూడా చాలా టివి షోస్ చేసింది. హీరో అయినా, హీరోయిన్ అయినా మంచు లక్ష్మి అడిగే ప్రశ్నలు మాత్రం క్రేజీగా ఉన్నాయని చెప్పొచ్చు. కొందరు గురించి ఇంతకుముందు తెలియని సీక్రెట్స్ కూడా బయట పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: