సినిమాలు అందరూ తీస్తారు. కానీ దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడమే కష్టం. కొన్ని కొన్ని సార్లు మంచి సినిమాలు సైతం జనాల్లోకి తీసుకువెళ్లక పోవడం వల్ల నష్టాల పాలవుతాయి. సినిమా తీసిన తర్వాత మార్కెటింగ్ అనేది తప్పనిసరి. సాహో సినిమా బాగాలేదని టాక్ వచ్చినా వసూళ్ళు బాగా సాధించిందంటే కారణం ఆ చిత్ర్ర బృందం చేసిన ప్రచారమే కారణం. ముఖ్యంగా ప్రభాస్ సాహో సినిమా ప్రమోషన్స్ ని తన భుజాల మీద వేసుకున్నాడు.


సినిమాకి ఓపెనింగ్స్ రావాలంటే ప్రమోషన్ కంపల్సరీ. అందుకే స్టార్లు సైతం సినిమా రిలీజ్ అవుతుందంటే టీవీల్లో కనిపిస్తారు. ఓపెనింగ్స్ రావాలంటే సినిమా ప్రమోషన్స్ బాగుండాలి. కలెక్షన్లు బాగుండాలంటే కంటెంట్  బాగుండాలి. ఓవరాల్ గా ఇది లెక్క. అయితే సినిమా ప్రచారంలో కూడా చాలా మార్పులొచ్చాయి. సినిమా రిలీజ్ కి రెండు నెలలు ముందు నుండే ప్రచారం స్టార్ట్ చేస్తుంటారు.


సోషల్ మీడియా వచ్చాక ఇది మరింత ముందుకు వెళ్లింది. సినిమా లాంచింగ్ దగ్గరి నుండి రిలీజ్ అయ్యే వరకు ప్రతీ అప్డేట్ షేర్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నది ఇలాంటి ప్రమోషన్ గురించే. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో "అల వైకుంఠపురములో" అనే చిత్రం తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుండి సామజవరగమనా అనే సాంగ్ ని లాంచ్ చేశారు.


ఈ పాట్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏడు లక్షలకు పైగా లైక్స్ వచ్చిన మొదటి తెలుగు పాటగా గుర్తింపు పొందింది. అయితే ఈ పాటని ప్రమోషన్ లో భాగంగానే రిలీజ్ చేశారట. ప్రత్యేకించి సిద్ శ్రీరామ్, థమన్ లతో   25 లక్షల రూపయలు ఖర్చు పెట్టి పెద్ద సెట్ లో వీడియో షూట్ చేశారట. సీతారామశాస్త్రి గారు రచన చేసిన ఈ పాటని సిద్ శ్రీరామ్ పాడగా థమన్ సంగీతం అందించారు. క్లాసికల్ మ్యూజిక్ కి వెస్ట్రన్ టచ్ ఇవ్వడంతో ఈ పాట ప్రేక్షకులకి అమితంగా నచ్చింది. దీంతో ఈ సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది.




మరింత సమాచారం తెలుసుకోండి: