కంగనా రనౌత్‌ 'ఐ లవ్ యూ' బస్ సినిమా నుండి బయటకు వచ్చేశారు.2006లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గానూ, విమర్శనాత్మకంగానూ కూడా మంచి విజయం సాధించింది. ఆమె నటనకు కూడా మంచి గుర్తింపు లభించింది.తాగుబోతు పాత్రలో నటించిన కంగనాకు విమర్శకుల నుంచీ ఎన్నో ప్రశంసలు లభించాయి.ఈ సినిమాలోని  ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారంతో పాటు ఇతర పురస్కారాలు కూడా లభించాయి.    


ఇపుడు ఆమె కేవలం కథానాయికగా మాత్రమే చేస్తూ తన ప్రతిభకు హద్దులు గీసుకోవడం లేదు,వచ్చే ఏడాది జనవరిలో తన నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నారామె ‘‘నా కొత్త నిర్మాణ సంస్థను జనవరిలో మొదలు పెట్టడానికి పనులు జరుగుతున్నాయి. ముందుగా చిన్న సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే కథలను సిద్ధం చేస్తున్నాం అంటున్న బాలీవుడ్‌ ‘క్వీన్‌’.     


 ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారు. వాళ్లతో సినిమాలు తీస్తా. నా ప్రొడక్షన్‌లో నేను నటించాలనుకోవడం లేదు.నా వద్దకు వచ్చే ప్రతి కథలో నేను నటించడం కుదరకపోవచ్చు. కానీ మంచి కథలు వెండితెరపై రావాల్సిన అవసరం ఉంది.ఇక నా దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా గురించిన ప్రకటన త్వరలోనే వస్తుంది అంటున్న కంగనా రనౌత్‌. మణికర్ణిక ఫిల్మ్స్‌ అనేది కంగనా రనౌత్‌ ప్రొడక్షన్‌ టైటిల్‌ అని బాలీవుడ్‌ సమాచారం.కాకపోతే ‘థాకడ్‌’ సినిమా తర్వాతే దర్శకత్వంపై నేను పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నాను’’ అని కంగనా రనౌత్‌ తెలిపారు. 
ఒక హీరోయిన్ కంగనా రనౌత్‌  డైరెక్టర్ గా మరియు ప్రొడ్యూసర్ గా .. ఎం చేస్తారో చూడాలి ...!                                                                                   


మరింత సమాచారం తెలుసుకోండి: