ఏంటి రా గ్యాప్ ఇచ్చావ్ అని తండ్రి అడిగితే " ఇవాళే అది వచ్చింది " అని చిన్న వీడియో క్లిపింగ్ తో ముందుకు వచ్చిన " అల... వైకుంఠపురంలో " సినిమా టీం అందరి ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. కానీ దాని తరువాత సంగీత దర్శకుడు ఈ సినిమా కోసం స్వరపరిచిన ఒకే ఒక్క పాట సోషల్ మీడియాకు నిద్రపట్టకుండా చేస్తోంది. యూట్యూబ్‌ను నిరంతంర పరుగులు పెడుతుంది. "సామజవరగమన.. నిను చూసి ఆగగలన" అంటూ రిలీజ్ అయిన ఈ పాట రికార్డులు కొల్లగొట్టకుండా ఉంటానా అంటోంది.  


టి ప్రస్తుతం సిద్ శ్రీరామ్ గాత్రం ఈ మధ్య యూత్‌ను తెగ ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు గీతగోవిందం సినిమాలోని "ఇంకేం ఇంకేం కావాలే" పాట, టాక్సీవాలా సినిమాలోని "మాటే వినదుగా సాంగ్", హుషారు చిత్రంలోని "ఉండిపోరాదే" అనే పాట అయినా యూత్‌ను ఇలానే కట్టిపడేశాయి. ప్రతి ఒక్క పాట కూడా సెన్సేషన్‌గా మారిపోయి. దీనితో ఒక్కసారిగా సిద్ శ్రీరామ్ పేరు మార్మోగిపోయేలా చేశాయి. తాజాగా "అల ... వైకుంఠపురము" నుంచి "సామజవరగమన" అనే పాటను గాత్రం చేసాడు ఈ యువ గాయకుడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది.


మన టాలీవుడ్ లో ఎక్కవుగా అల్లు అర్జున్ సినిమాలు హిందీలో డబ్ అవుతూ ఉంటాయి. అవి ఇక్కడి వాటి కంటే ఎక్కువ వ్యూస్‌ను సంపాదిస్తున్నాయి. రేసుగుర్రం, సరైనోడు వంటి  చిత్రాలు ఈజీగా 100 మిలియన్లను క్రాస్ చేశాయి. ఇలా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడం అల్లు అర్జున్ కి కొత్తేం కాదు. అయితే ఇప్పుడు మరో సారి ఒకే ఒక్క పాటతో దుమ్ము దులుపుతున్నాడు ఈ అల్లు హీరో. 


ఇప్పడి వరకు 40 మిలియన్ల వ్యూస్, ఏడు లక్షల లైక్స్‌ తో ఇప్పటికే ఈ పాటను సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఏడు లక్షల లైకులతో మరో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది ఈ పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం, తమన్ అందించిన బాణీ ఈ పాటను అంతగా అందరికి నచ్చేలా చేశాయి. ఇక ఇప్పటికే ఎంతోమంది రింగ్ టోన్, కాలర్ టోన్‌ గా పెట్టుకుని ఈ పాటను తెగ ఆస్వాధిస్తున్నారు. ఇందుకు గాను సోషల్‌ మీడియాకు థ్యాంక్స్ చెప్పాడు బన్నీ.


మరింత సమాచారం తెలుసుకోండి: